Tollywood: 90వ దశకంలో తనదైన నటనతో, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వడ్డే నవీన్. ఒకానొక సమయంలో వరుస హిట్లతో దూసుకుపోయిన ఆయన, ఆ తర్వాత క్రమంగా వెండితెరకు దూరమయ్యారు. దాదాపు పదేళ్లకు పైగా ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో, అసలు వడ్డే నవీన్ సినిమాలకు ఎందుకు బ్రేక్ ఇచ్చారు? ఇండస్ట్రీని కావాలనే వదిలేశారా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయాయి. తాజాగా వీటన్నింటికీ ఆయన స్వయంగా తెరదించారు.
తాను సుదీర్ఘ కాలం పాటు సినిమాలకు దూరం కావడానికి గల అసలు కారణాన్ని వడ్డే నవీన్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా పంచుకున్నారు. ఇండస్ట్రీని తనేమీ మర్చిపోలేదని, అయితే తన మనసుకు నచ్చిన, మెప్పించిన కథలు రాకపోవడం వల్లే ఇన్నాళ్లూ కెమెరా ముందుకు రాలేకపోయానని స్పష్టం చేశారు. ఈ గ్యాప్‌లో చాలామంది దర్శకులు తనను కలిసి రకరకాల కథలు వినిపించారని, కానీ ఇప్పుడున్న ట్రెండ్‌కు ఆ కథలు సరిపోవనిపించి సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కేవలం కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తల వల్లే ఈ విరామం వచ్చిందని ఆయన వివరించారు.
ఇక లాంగ్ గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ మళ్లీ హీరోగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ కథ వినగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని, అందుకే మళ్లీ మేకప్ వేసుకున్నానని ఆయన తెలిపారు. సాధారణంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే సీనియర్ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోతుంటారు. కానీ నవీన్ మాత్రం ఇప్పటి ఆడియన్స్ పల్స్‌కు తగ్గట్టు ఒక ట్రెండీ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో హీరోగానే ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
ఇకపై లాంగ్ గ్యాప్స్ ఉండవని, ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ఇచ్చిన బూస్ట్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వడ్డే నవీన్ హింట్ ఇచ్చారు. ఇటీవల సీనియర్ నటుడు అర్జున్ ఎలాంటి అంచనాలు లేకుండా ‘బ్లాస్ట్’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టినట్లే, వడ్డే నవీన్ కూడా ఈ సరికొత్త థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.