Categories: DevotionalLatestNews

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శన టోకెన్ల సమయాలు మార్పు.. తిరుమలలో వీకెండ్ రద్దీ..

Tirumala: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి అధికారులు కీలక సమాచారాన్ని అందించారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తుల స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. ఇలా తిరుమలలో రద్దీ ఉన్న నేపథ్యంలో దర్శన టోకెన్ల జారీ సమయాలలో కొన్ని తాత్కాలికంగా మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇక వేసవి సెలవులు పూర్తి కావడంతో దర్శన టోకెన్ సమయాలలో మళ్ళీ మార్పులు చేసినట్టు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ ఉన్న నేపథంలో అర్థరాత్రి సమయంలో దర్శన టోకెన్లను జారీ చేశారు.

ప్రస్తుతం తిరుమలలో కాస్త రద్దీ తగ్గుతున్న నేపథ్యంలో నేటి నుంచి దర్శన టోకెన్లను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే జారీ చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లలో ఏర్పాటు చేసిన టోకెన్ కేంద్రాల వద్ద భక్తులు ఈ టోకెన్లను పొందవచ్చు. అయితే టోకెన్ పొందడం కోసం వెళ్లే భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాలి. ఇలా గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే టోకెన్ ఇవ్వబడుతుంది.

Tirumala devotees alert darshan token timing schedule changed know details

Tirumala: శుక్రవారం రూ. 3.58 కోట్ల హుండి ఆదాయం ..

వేసవి సెలవులు పూర్తి కావడంతో తిరుమలలో కొంతమేర రద్దీ తగ్గింది అయితే వారాంతపు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య కాస్త పెరిగింది. స్వామివారి సర్వ దర్శనం కోసం ఎనిమిది గంటల తర్వాత నుంచి వెళ్లే భక్తులకు సుమారు 24 గంటల పాటు దర్శన సమయం పడుతున్నట్లు తెలిపారు.రూ.300 టికెట్ పొందిన వారికి 4 -6గంటల సమయం పడుతుంది. దివ్య దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 5-8 గంటల సమయం పడుతుంది. శుక్రవారం74,128 మంది భక్తుల స్వామి వారిని దర్శించుకున్నట్టు టీటీడీ తెలిపింది. నిన్న ఒక్కరోజే స్వామివారి రూ. 3.58 కోట్ల హుండి ఆదాయం రాగా,36,053 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు.3.98 లక్షల లడ్డూలను కూడా భక్తుల విక్రయించారు. వీకెండ్ కావడంతో తిరుమలలో తిరిగి కాస్త రద్దీ పెరిగిందని తెలుస్తోంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.