Mosquitoes: వర్షాకాలం మొదలవడంతో ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడం, మన ఇంటి పరిసర ప్రాంతాలను చెత్తాచెదారం ఉన్నప్పుడు కచ్చితంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇలా దోమలు కుట్టడం వల్ల ఎన్నో హానికరమైన వ్యాధులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతకర వ్యాధుల కారణంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా దోమకాటుకు గురికాకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
ఇకపోతే వర్షాకాలంలో దోమలు పెరుగుతున్న తగ్గించడం కోసం సహజ సిద్ధంగా కొన్ని పనులను చేయటం వల్ల దోమల బాధ నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మన ఇంటి ఆవరణంలోనూ లేదా ఇంటి బాల్కనీలో ఇలాంటి చిన్న చిన్న ముక్కలను నాటడం వల్ల దోమలను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టవచ్చు. మరి ఆ మొక్కలు ఏంటీ అనే విషయానికి వస్తే.. మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్యపరంగాను తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ తులసి మొక్క నుంచి వచ్చే వాసనకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అందుకే ఇంటి ఆవరణంలో తులసి మొక్కను పెట్టుకోవడం ఎంతో మంచిది.
పుదీనాలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి పుదీనా మొక్క ఉంటే ఘాటైన సువాసన వస్తుంది.ఈ వాసన కీటకాలు,దోమలకు ఏమాత్రం సరిపోదు. ఇలా పుదినా ఇంటి బాల్కనీలో కుండీలలో పెంచడం వల్ల దోమల నివారణ చేపట్టవచ్చు. నీలి రంగు పుష్పాలతో ఎంతో అందంగా కనిపించే లావెండర్ మొక్కను ఇంటి బాల్కనీలో పెంచుకోవడం ఎంతో మంచిది. లావెండర్ పువ్వుల వాసన మనకు ఎంతో సువాసన భరితంగా ఉన్నప్పటికీ దోమలు మాత్రం ఈ వాసనలను భరించలేవు అందుకే లావెండర్ ఇంటి బాల్కనీలో పెంచుకోవడం వల్ల దోమలను నివారించవచ్చు. బంతి పువ్వుల మొక్కలు కూడా పెంచడం మంచిది. అయితే ఈ మొక్కలను కుండీలలో నాటేటప్పుడు కచ్చితంగా కుండీలకు రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి అప్పుడే నీరు నిలవకుండా ఉండడమే కాకుండా దోమలను కూడా అరికట్టవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.