Tollywood: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే మొన్నటి వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ తప్ప కంటెంట్ లేని కథలు వస్తూ ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. అందుకే టాలీవుడ్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయినా కూడా అవార్డులలో మాత్రం సత్తా చాటలేకపోయేవి. హిందీ సినిమాలకి, అలాగే తమిళ సినిమాలకి నేషనల్ అవార్డులు వచ్చినట్లుతెలుగు సినిమాలకి రావకపోవడానికి హీరోల ఆలోచన విధానం కారణం అనే అభిప్రాయం అందరిలో ఉండేది. ప్రేక్షకులని మెప్పించడానికి రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా కథలతోనే సినిమాలు చేసేవారు. ఈ కమర్షియల్ సినిమాలతో స్టార్స్ అయిన కూడా నటులుగా ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోయేవారు.
అయితే మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల టేస్ట్ కూడా మారిపోయింది. ఒటీటీల హవా మొదలైన తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ భాగా ప్రేక్షకులకి రీచ్ అయ్యింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు డబ్బింగ్ రూపంలో చేరువ అవుతున్నాయి. ఇక ఆ కథలని చూసిన తర్వాత కమర్షియల్ ఫార్ములా స్టొరీలని థియేటర్స్ కి వెళ్లి చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. కథలో కొత్తదనం ఉంటేనే తప్ప థియేటర్స్ కి వెళ్ళడం లేదు. ఓపెనింగ్స్ వచ్చిన కూడా తరువాత కథ బాగుంది అనే టాక్ వస్తేనే థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. లేదంటే రెండో రోజే ఖాళీ అవుతాయి. ఈ నేపధ్యంలోనే హీరోల ఆలోచన విధానం పూర్తిగా మారింది. దీంతో కొత్తదనం ఉన్న కథల కోసం ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆ దిశగానే తమ అడుగులు వేస్తూ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు.
అలా చేసిన వాటిలో ఈ ఏడాది వేసవి వినోదంగా రాబోతున్న సినిమాలు వేటికవే ప్రత్యేకత కలిగి ఉండటం విశేషం. మార్చి 30న రిలీజ్ కాబోతున్న నాని దసరా సినిమా ఫుల్ మాస్ కాన్సెప్ట్ తో పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కింది. ఇక ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో వస్తుంది. తరువాత నిఖిల్ హీరోగా స్పై మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. అదే రోజు అల్లరి నరేష్ ఉగ్రం మూవీ కూడా రిలీజ్ అవుతుంది.
ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. తరువాత అఖిల్ ఏజెంట్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. అలాగే నాగచైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న కస్టడీ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. అదే రోజు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్ రిలీజ్ కాబోతుంది.