Tue. Jan 20th, 2026

    Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారట. దీనికి సంబంధించి అసలు విషయంలోకి వెళదాం.

    తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబుకి అటు నిర్మాతగా ఇటు సీనియర్ హీరోగా ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. చిన్న వేశంతో ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన మోహన్ బాబు ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, నిర్మాతగా సక్సెస్‌లు చూశారు. ఆయన వారసులు అయిన మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న కూడా తెలుగు ఇండస్ట్రీలో నటులుగా, నిర్మాతలుగా కొనసాగుతున్నారు.

    tollywood-robbery-at-mohan-babus-house
    tollywood-robbery-at-mohan-babus-house

    Tollywood: మోహన్ బాబు సినిమా అంటే కాస్త జాగ్రత్తగానే ఉంటారు.

    ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ‘హడల్’ అని అందరూ చెబుతుంటారు. ఆయన ముందు నించుని ధైర్యంగా మాట్లాడటానికి అందరూ సాహసించరు. క్రమశిక్షణ, టైమింగ్ విషయంలో ఆయన ఎంతో కఠినంగా వ్యవహరిస్తారు. దర్శకులు కూడా మోహన్ బాబు సినిమా అంటే కాస్త జాగ్రత్తగానే ఉంటారు. అంత కఠినంగా ఉండే ఆయన ఇంట్లోనే పనిమనిషి చోరీ చేయడం షాకింగ్ విషయం.

    దాదాపు 10 లక్షల రూపాయలు దొంగతనం చేసినట్టుగా సమాచారం. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసంలో నాయక్ అనే పనిమనిషి 10 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయాడు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు ఈ మంగ‌ళ‌వారం (24.09.2024) రాత్రి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారు దర్ఫ్యాప్తు చేస్తున్నారు.

    tollywood-robbery-at-mohan-babus-house
    tollywood-robbery-at-mohan-babus-house

    కాగా, మోహన్ బాబు ‘కన్నప్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన తనయుడు మంచు విష్ణు పాన్ ఇండియన్ చిత్రంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాది చివరిన విడుదల చేయాలని విష్ణు సన్నాహాలు చేస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.