Tollywood : మెలోడి బ్రహ్మగా పాపులర్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మని ఓ సందర్భంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ అవమానించారట. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాకు మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. ఆ సమయంలో రాంగోపాల్ వర్మకి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. అప్పట్లో రాంగోపాల్ వర్మ క్రేజ్ ఇటి తెలుగులో అటు హిందీలో విపరీతంగా ఉండేది.
ముంబైలో అయితే వర్మ ఆఫీస్ ముందు నిర్మాతలు క్యూ కట్టేవారు. ముంబైలో ఆర్జీవీ ఆఫీసు ఉన్నంత వెరైటీగా ఇంకో దర్శకుడిది గానీ, నిర్మాతది గానీ లేదంటే ప్రతీ విషయంలో ఆర్జీవీ ఎంత వినూత్నంగా ఆలోచించేవారో తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో కూడా డెన్ ప్రారంభించారు. ఆర్జీవీ. ఇక్కడ ఉన్న సినిమా వాళ్ళు గానీ, కామన్ ఆడియన్స్ గానీ ఆర్జీవీ డెన్ ని ఒక్కసారైనా చూడాల్సిందే.
Tollywood : సంగీత దర్శకుడిగా మణిశర్మకి మొదటి పాట అదే.
టెక్నీషియన్స్ దగ్గర్నుంచి వర్క్ ని ఎలా రాబట్టుకోవాలో ఆర్జీవీకి తెలిసినంతగా ఇంకో దర్శకుడికి తెలియదని సినిమా వాళ్ళే ఒప్పుకున్నారు. అదే అప్పట్లో మణిశర్మని రెచ్చగొట్టేలా చేసింది. ఆర్జీవీ అంతం సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘చలెక్కి ఉందనుకో’ అనే పాటకి సంగీతం అందించమని రామూ మణిశర్మని అడిగారు. అదే సంగీత దర్శకుడిగా మణిశర్మకి మొదటి పాట. ఈ పాట ఛాన్స్ ఇవ్వడానికి ముందు నువ్వు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే బాగా చేస్తావు గానీ, సాంగ్స్ కంపోజ్ అంటే నీ వల్ల అవుతుందా..? అని అనుమానించారట.
అది ఎంతో ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకున్న మణిశర్మ అంతం సాంగ్ కంపోజ్ చేసి చూపించారు. అది నచ్చిన ఆర్జీవీ చిరంజీవితో మనం సినిమా చేస్తున్నాము. నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని సర్‌ప్రైజ్ ఇచ్చారట. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయింది. అయినా మణిశర్మ ఆ తర్వాత చూడాలని ఉంది అనే సినిమాకి సంగీతం అందించే అవకాశం నేరుగా చిరంజీవి నుంచే అందుకోవడం విశేషం.