Thu. Jan 22nd, 2026

    Tollywood: ప్యాకేజీ స్టార్స్‌గా నయనతార, త్రిష..అవును ఇప్పుడు అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో ఈ ఇద్దరు భామలు డేట్స్ ఇవ్వాలంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తోందట. అన్నీ కలిపి మంచి ప్యాకేజీ రూపంలో నయన్, త్రిషలకి నిర్మాతలు ముట్టచెబుతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి 15 ఏళ్ళకి పైగానే అయింది.

    యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ దాదాపు అందరు సరసన నటించారు. కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే నయన్, త్రిషలకి పెద్ద తేడా ఉండదు. ఇద్దరికీ మంచి సక్సెస్ రేట్ ఉంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా అవేవీ వీరి కెరీర్‌ని ఇబ్బందుల్లో పడేయలేదు. ఇప్పటికీ నయన్ డేట్స్ దొరకడం చాలా కష్టం. త్రిష ఒక్కో సినిమాను చాలా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటుంది. చేసిన సినిమా మంచి కాంబోలో ఉండాలని ఫిక్సైంది.

    tollywood-nayanthara-trisha-as-package-stars
    tollywood-nayanthara-trisha-as-package-stars

    Tollywood: ఈ రేంజ్ రెమ్యునరేషన్ సౌత్ లో కేవలం ఇద్దరే ఇద్దరికి

    అందుకే, త్రిషకి మంచి డిమాండ్ ఉంది. ఇక త్రిష ఇటీవల లియో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో త్రిషని చూసిన వారు లవ్ లో పడకుండా ఉండలేరు. అంత అందంగా ఉంది. ఇప్పుడు అటు తమిళంలో ఇటు తెలుగులో త్రిష ని మేకర్స్ సీనియర్ హీరోల కొసం సంప్రదిస్తున్నారు. నయన్ కి అలాగే భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి. అట్లీ రూపొందించిన బాలీవుడ్ మూవీతో అక్కడ మంచి ఎంట్రీ ఇచ్చింది నయన్.

    షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ నయనతారకి హిందీలో మంచి హిట్ దక్కేలా చేసింది. దాంతో అక్కడ కూడా నయన్ కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరికీ ప్రాజెక్ట్ గనక పాన్ ఇండియా లెవల్ లో రూపొందేదైతే 10 నుంచి 12 కోట్ల వరకూ నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారట. ఈ రేంజ్ రెమ్యునరేషన్ సౌత్ లో కేవలం ఇద్దరే ఇద్దరికి ఉందని ఆ ఇద్దరూ నయనతార, త్రిష అని చెప్పుకుంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.