Tue. Jan 20th, 2026

    Tollywood : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోలు 60కై పైబడిన స్టార్ హీరోలు జుట్టుకు రంగేసుకొని 40 ఏళ్ళ వయసున్నవారిలా రెచ్చిపోతున్నారు. ఇది ఆయా హీరోల ఫ్యాన్స్ వరకూ బాగానే ఉన్నా, విమర్శకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మన సీనియర్ హీరోలు ఇంకా హీరో వేశాలకి ఫుల్ స్టాప్ పెడితే బావుంటుందేమో..! అని కామెంట్స్ చేస్తున్నారు.

    బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గత కొంతకాలంగా ఆయన వయసుకు తగ్గ కథలను ఎంచుకుంటూ సక్సెస్ చూస్తున్నారు. పింక్, బద్లా లాంటి సినిమాలు బిగ్ బి కి మంచి పేరును తెచ్చిపెట్టాయి. అయితే, మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, లేటు వయసులోనూ రొమాన్స్, యాక్షన్, ఫైట్స్, ఛేజింగ్స్ అంటూ అవస్థలు పడుతున్నారు.

    tollywood-Do senior heroes have to change.. why such stories?
    tollywood-Do senior heroes have to change.. why such stories?

    Tollywood : ఇలాంటివి ఫ్యాన్స్ కే రుచించడం లేదు.

    ఫ్యాన్స్ ని మెప్పించడానికి చేస్తున్నారనే విషయం ఇక్కడ క్లియర్‌గా తెలుస్తోంది. అదే ఫ్యాన్స్ కోసం కథా బలమున్న సినిమాలు చేస్తే గ్రాఫ్ ఇంకోలా ఉంటుంది. హీరోగా కాకుండా ఓ నాయకుడిగా కనిపించే పాత్రలు మన సీనియర్ హీరోలకి బాగా సూటవుతాయి. ఓ సైంటిస్ట్ గానో, డిటెక్టివ్ పాత్రలలోనో, సీబీఐ ఆఫీసర్ పాత్రల్లోనూ కనిపించి కథా మొత్తం తమ చుట్టూ తిప్పుకోవచ్చు. కానీ, మాసీవ్ రోల్స్ వేయాలి..హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలి.

    కొడితే ఒకేసారి పదిమంది విలన్లు ఎగిరెళ్ళి ఎక్కడో పడాలి. ట్రైన్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్ చేయాలి. కానీ, ఇలాంటివి ఫ్యాన్స్ కే రుచించడం లేదు. ఇక కామన్ ఆడియన్స్ కి ఎంతమాత్రం నచ్చుతుందో బేరీజు వేసుకోవాలి. ఇటీవల కాలంలో మన సీనియర్ హీరోలు నటించిన చాలా సినిమాలు ఫ్లాపవడానికి కారణం వాళ్ల వయసుకు తగ్గ కథలను ఎంచుకోకపోవడమే. అప్పుడెప్పుడో వెంకటేశ్ గురు అనే సినిమా చేశారు.

    tollywood-Do senior heroes have to change.. why such stories?
    tollywood-Do senior heroes have to change.. why such stories?

    Tollywood : ఇలాంటి కథలే ఇప్పుడు జనాలకి కావాల్సింది.

    ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించించో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ అంటూ హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సినిమా కాకుండా ప్రేక్షకులు మెచ్చే సినిమా చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి కథలే ఇప్పుడు జనాలకి కావాల్సింది. మొహం మీద ముడతలు కనిపిస్తున్నా గ్రాఫిక్స్ లో కవర్ చేస్తున్నారు. కానీ, యాక్టింగ్‌లో ఆ వయసు ప్రభావం కనిపిస్తుంది కదా. ఇంకా ఎప్పటికి తెలుసుకుంటారో మన సీనియర్ హీరోలు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.