Tollywood Cinema News : ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి రౌడీ హీరో అని ఇమేజ్ వచ్చేసింది. ఇదే సినిమాను అటు బాలీవుడ్ లో ఇటు తమిళంలోనూ తీసి భారీ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇదే కథను హిందీలో షాహిద్ కపూర్, కిరాయారా అద్వానీలతో తీసీ బాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.
తెలుగులో తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత సందీప్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ కి కథ చెప్పారు. కానీ, ఎవరూ ఆయన మేకింగ్ కి భయపడి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే, బాలీవుడ్‌లో ప్రాజెక్ట్ ఓకే చేయించుకొని అక్కడ రెండవ సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమానే ‘యానిమల్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యాకె ప్రభాస్ ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో రూపొందబోతున్న సందీప్ రెడ్డి వంగా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ‘అర్జున్ రెడ్డి’ లాంటి కల్ట్ మూవీ తర్వాత బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌లతో సినిమాలు చేసే ఛాన్స్ అందుకున్నారు. ఇదంతా బావుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టార్స్ మీద రెచ్చిపోయి ఓ ఆట ఆడుకున్న శ్రీరెడ్డి ..సందీప్ రెడ్డితో డేట్ చేయాలని ఉంది..అనే మాట ఓపెన్‌గా చెప్పడం.
శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో లోగుట్టును బట్టబయలు చేసి పలువురు సినీ స్టార్స్‌ను ఏకిపారేసిన సంగతి తెలిసిందే. అలాంటి శ్రీరెడ్డి, ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఫిదా అయ్యానని తెలిపింది. అంతేకాదు, ఆయనతో కలిసి డేట్ కి వెళ్ళాలని ఉంది..డైరెక్ట్‌గా లిప్ లాక్ ఇవ్వాలని ఉంది..అంటూ బోల్డ్ గా మాట్లాడి హాట్ టాపిక్ అయింది. ఈ మాటలు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోవి. అవి ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుండటం ఆసక్తికరమైన విషయం.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.