Tue. Jan 20th, 2026

    Tollywood Cinema News : ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి రౌడీ హీరో అని ఇమేజ్ వచ్చేసింది. ఇదే సినిమాను అటు బాలీవుడ్ లో ఇటు తమిళంలోనూ తీసి భారీ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇదే కథను హిందీలో షాహిద్ కపూర్, కిరాయారా అద్వానీలతో తీసీ బాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.

    తెలుగులో తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత సందీప్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్స్ కి కథ చెప్పారు. కానీ, ఎవరూ ఆయన మేకింగ్ కి భయపడి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే, బాలీవుడ్‌లో ప్రాజెక్ట్ ఓకే చేయించుకొని అక్కడ రెండవ సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమానే ‘యానిమల్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

    tollywood-cinema-news-sri-reddy-will-give-lip-lock-to-sandeep-reddy-vanga
    tollywood-cinema-news-sri-reddy-will-give-lip-lock-to-sandeep-reddy-vanga

    ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యాకె ప్రభాస్ ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో రూపొందబోతున్న సందీప్ రెడ్డి వంగా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ‘అర్జున్ రెడ్డి’ లాంటి కల్ట్ మూవీ తర్వాత బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌లతో సినిమాలు చేసే ఛాన్స్ అందుకున్నారు. ఇదంతా బావుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టార్స్ మీద రెచ్చిపోయి ఓ ఆట ఆడుకున్న శ్రీరెడ్డి ..సందీప్ రెడ్డితో డేట్ చేయాలని ఉంది..అనే మాట ఓపెన్‌గా చెప్పడం.

    శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో లోగుట్టును బట్టబయలు చేసి పలువురు సినీ స్టార్స్‌ను ఏకిపారేసిన సంగతి తెలిసిందే. అలాంటి శ్రీరెడ్డి, ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఫిదా అయ్యానని తెలిపింది. అంతేకాదు, ఆయనతో కలిసి డేట్ కి వెళ్ళాలని ఉంది..డైరెక్ట్‌గా లిప్ లాక్ ఇవ్వాలని ఉంది..అంటూ బోల్డ్ గా మాట్లాడి హాట్ టాపిక్ అయింది. ఈ మాటలు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోవి. అవి ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుండటం ఆసక్తికరమైన విషయం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.