Tollywood : చిత్ర పరిశ్రమలో సినీ తారలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలనాటి మహానటి సావిత్రి నుంచి నేటి యువ కథానాయికల వరకు చాలామంది తమ సహ నటులను, దర్శకులను, నిర్మాతలను, సంగీత దర్శకులను ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అంతేకాదు, సమంత – నాగ చైతన్య లాంటి వారు ఎంతో కాలం ప్రేమించి ఇరు కుటుంబాల సమంక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవడం..ఉన్నట్టుండి విడాకులు తీసుకోవడమూ జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మహానటి సావిత్ర బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషించిన యంగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ త్వరలో ఓ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతుందని తాజాగా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి కీర్తి పెళ్లి విషయంలో ఇలా వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నోసార్లు సహ నటుడితో పెళ్లి పీటలెక్కబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం అయింది. ఆ తర్వాత ఓ వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్ళాడబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడేమో తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే కీర్తి, అనిరుధ్ కలిసి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tollywood : కీర్తి పెళ్లి చూడాలనుకుంటున్న తన అభిమానులకి మళ్ళీ నిరాశ.!
ఆ ఫొటోలను చూసినప్పటి నుంచే అందరూ ఈ అభిప్రాయానికి వచ్చారు. సాధారణంగా అంత క్లోజ్‌గా ఉంటే ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోనున్నారని అనుకోవడం చాలా సహజం. అయితే, ఇదంతా కేవలం స్నేహబంధమే అని స్వయంగా కీర్తి సురేశ్ తండ్రి క్లారిటీ ఇచ్చారు. అలాగే కీర్తి కూడా తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అనిరుధ్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే..తనతో నేను ప్రేమలో ఉన్న మాట అవాస్తవం. పెళ్లిపై వస్తున్నవన్నీ రూమర్స్.. అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది.
దీంతో కీర్తి పెళ్లి చూడాలనుకుంటున్న తన అభిమానులకి మళ్ళీ నిరాశ మిగిలింది. కాగా, కీర్తి నటించిన సినిమాలన్నీ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్‌కి సంతకం చేస్తూనే ఉంది. చూడాలి మరి మళ్ళీ మహానటి సినిమా వంటి భారీ హిట్ కీర్తి ఖాతాలో ఎప్పుడు చేరుతుందో.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.