Wed. Jan 21st, 2026

    Tollywood : చిత్ర పరిశ్రమలో సినీ తారలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలనాటి మహానటి సావిత్రి నుంచి నేటి యువ కథానాయికల వరకు చాలామంది తమ సహ నటులను, దర్శకులను, నిర్మాతలను, సంగీత దర్శకులను ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అంతేకాదు, సమంత – నాగ చైతన్య లాంటి వారు ఎంతో కాలం ప్రేమించి ఇరు కుటుంబాల సమంక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవడం..ఉన్నట్టుండి విడాకులు తీసుకోవడమూ జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మహానటి సావిత్ర బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషించిన యంగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ త్వరలో ఓ పాపులర్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతుందని తాజాగా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.

    వాస్తవానికి కీర్తి పెళ్లి విషయంలో ఇలా వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నోసార్లు సహ నటుడితో పెళ్లి పీటలెక్కబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం అయింది. ఆ తర్వాత ఓ వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్ళాడబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడేమో తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే కీర్తి, అనిరుధ్ కలిసి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    tollywood-calarity-about-keerthy-suresh-anirudh-marriage
    tollywood-calarity-about-keerthy-suresh-anirudh-marriage

    Tollywood : కీర్తి పెళ్లి చూడాలనుకుంటున్న తన అభిమానులకి మళ్ళీ నిరాశ.!

    ఆ ఫొటోలను చూసినప్పటి నుంచే అందరూ ఈ అభిప్రాయానికి వచ్చారు. సాధారణంగా అంత క్లోజ్‌గా ఉంటే ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోనున్నారని అనుకోవడం చాలా సహజం. అయితే, ఇదంతా కేవలం స్నేహబంధమే అని స్వయంగా కీర్తి సురేశ్ తండ్రి క్లారిటీ ఇచ్చారు. అలాగే కీర్తి కూడా తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అనిరుధ్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే..తనతో నేను ప్రేమలో ఉన్న మాట అవాస్తవం. పెళ్లిపై వస్తున్నవన్నీ రూమర్స్.. అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది.

    దీంతో కీర్తి పెళ్లి చూడాలనుకుంటున్న తన అభిమానులకి మళ్ళీ నిరాశ మిగిలింది. కాగా, కీర్తి నటించిన సినిమాలన్నీ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుసగా కొత్త ప్రాజెక్ట్స్‌కి సంతకం చేస్తూనే ఉంది. చూడాలి మరి మళ్ళీ మహానటి సినిమా వంటి భారీ హిట్ కీర్తి ఖాతాలో ఎప్పుడు చేరుతుందో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.