Mukkoti Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశలో వస్తాయి అనే సంగతి మనకు తెలిసిందే. ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి పండుగ రోజున శ్రీహరి ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున వైకుంఠ ద్వారం కింద వెళ్లి స్వామి వారిని నమస్కరించుకుంటారు దీంతో ఈ పండుగ రోజు శ్రీహరి ఆలయాలన్నీ కూడా గోవింద నామస్మరణలతో మారుమోగుతూ ఉంటాయి.
శ్రీమహావిష్ణువును ప్రాతః కాల సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే పుణ్య సమయం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఏడాదికి 24 ఏకాదశలో ఉంటే ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్పాలి.అన్ని ఏకాదశులను పాటించడం కుదరని వారు, కనీసం ఈ రోజైనా ఆచరించాలి. ఎందుకంటే ఇవాళ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఈ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం కింద స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనం చేసిన పాపాలని తొలగిపోయి మోక్షం కలుగుతుందని భావిస్తారు. అందుకే సూర్యోదయాన్ని కంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ఆ హరి హరిని దర్శించుకుంటారు. ఇక నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో రాష్ట్రంలోనే పలు శ్రీవారి ఆలయాలు పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు.