Today Horoscope : మంగళవారం 21-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

మేషం :
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెద్దలు నుంచి ప్రశంసలను పొందుతారు. శరీరసౌఖ్యం మీకు అధికంగా ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉల్లాసకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
వృషభం :
ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో వీరు చేసే ప్రతి పని కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఆత్మీయుల సలహాలు మీకు ప్రశాంతతను కలిగిస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సఖ్యంగా మెలగాల్సి ఉంటుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. వివాదాలకు దాని తీసే అవకాశం ఉంటుంది. గణపతిని ఆరాధించడం వల్ల ఈ రాశి వారు ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారు మిత్రమా ఫలితాలను పొందుతారు వీరికి కష్టం,సుఖం రెండు ఉంటాయి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే మీకు విజయం ప్రాప్తిస్తుంది. తిరుగులేని ఫలితాలను పొందుతారు. మీ మార్గంలో ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా ఇబ్బంది కలిగించవు వాటిని కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా మీరు చేసే ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. చంద్ర ధ్యానం శుభదాయకం.
కర్కాటకం :
ఈరోజు మీరు కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ విషయంలో మీ సొంత నిర్ణయాలు పనిచేయవు. అందుకోసం మీరు మీ తోటివారిక సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అయినప్పటికీ మీరు పెద్దగా పట్టించుకోకండి. సమయాన్ని వృధా చేయకుండా మీ పనుల్లో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీరు చేసే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.నవగ్రహ ఆరాధన వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.
సింహం :
కృషే ఫలి అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముకోవాల్సి ఉంటుంది. మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా చేస్తుంది. మీరు ఈ రోజు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చిన్నప్పటి వివాదాలు ఏదుర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు పెరగకుండా జాగ్రత్త వహించాలి సమయానికి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శివరాధన వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు
కన్య :
ఈ రాశి వారికి ఈ రోజు దివ్యంగా ఉంది. వృత్తి,ఉద్యోగం,వ్యాపారం ఏ రంగమైన సరే మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొత్త పనులను కూడా ప్రారంభిస్తారు.శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం శుభప్రదం.
తుల :
ఈ రాశి వారు ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తిచేసి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. బంధుమిత్రుల నుంచి మీకు సహకారాలు అందుతాయి. మీరు తీసుకునే కొన్ని సాహసోపేతమైన ప్రయోగాత్మకమైన నిర్ణయాలు గొప్ప విజయాలను సాధిస్తాయి. మీ మీ రంగాల్లో ఎవరైనా శత్రువులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి. గిట్టని వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం :
ఈ రాశి వారు ముఖ్యంగా మనోబలం తగ్గకుండా చూసుకొని. మనోబలం తోనే మీ మీ రంగాల్లో మీరు విజయాలను సాధిస్తారు. ఆలోచనలు కూడా మార్పు రాకుండా చూసుకోండి. స్థిరత్వమైన ఆలోచనలతో మంచి ఫలితాలను పొందవచ్చు. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. లింగాష్టకం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
ధనుస్సు :
మీ చుట్టూ ఈరోజు ఉత్సాహకరమైన వాతావరణముంటుంది. వ్యాపారులైనా, ఉద్యోగులైనా మీ మీ రంగాల్లో ఎంత ఉత్సాహంతో పని చేస్తారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధించే సూచనలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా బంధు మిత్రులతో గడుపుతారు. ఆత్మీయులతో కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్ట దైవరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు
మకరం :
మీరు ఏ పని చేపట్టినా అది ముఖ్యమైన విషయం అయితే కంపల్సరీ దాని గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. విషయం తెలియక ముందుకు వెళితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేళ్ళ మీరు వ్యాపారస్తులయితే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మీతోటి వారితో చర్చించండి దానిపై సాధ్యం సాధ్యం గురించి మీరు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకునే వీలుంటుంది. ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కారణాలవల్ల అనవసరమైన భయానికి గురవుతారు. శని ధ్యానం చేయడం శుభప్రదం.
కుంభం :
ఈ రాశి వారికి దైవ బలం అధికంగా ఉంటుంది. ఏ పని చేపట్టిన ఆ దైవ బలంతోనే విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీరు నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. మీ పై అధికారులు మీకు అప్పగించిన పనులు అన్నిటిని కూడా మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. అందరిని కలుపుకొని మీరు ముందుకు సాగితేనే మీకు మేలు జరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. వృత్తి వ్యాపారాలు కూడా ఆర్థికంగా ఎదుగుతారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారు ఓర్పుతో ముందుకు సాగితే అద్భుతమైన విజయాలను పొందగలుగుతారు. చేపట్టబోయే ప్రతి పనిలో కూడా పట్టుదలతో పూర్తి చేసి విజయం సాధిస్తారు. అధికారులతో మీ సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి కూడా విశేషంగా ఉంటుంది. తోటి వారి సహకారంతో మీరు అనుకున్న ఫలితాలను కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా మీ సన్నిహితులు,తోటి వారితో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. నవగ్రహ ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.