Today Horoscope : గురువారం 30-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆ విశ్వాసంతోనే ముందుకు సాగి వారు చేపట్టిన పనులన్నిటిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్న దానికంటే మంచి ఫలితాలను వీరు పొందుతారు. వీరి ప్రతిభతోనే చేపట్టిన ప్రతి పనిలో విజయాలను అందుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.
వృషభం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ మీ రంగాల్లో అనుకూలంగా కూడా మీకు ఉంటుంది. ఈ రాశి వారు ఓ శుభవార్త వింటారు. అది మీకు మనో ధైర్యాన్ని అందిస్తుంది. మోహమాటానికి వెళ్లడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
మిథునం :
వీరికి శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగం వ్యాపారం ఏ రంగమైన సరే అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన పద్ధతులను ఆచరించడం వల్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం చాలా సంతోషకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు. ఇష్టమైన దైవారాధన చేయడం వల్ల ఫలితాలను పొందవచ్చు.
కర్కాటకం :
ఈ రాశి వారికి మిత్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. మధ్యలో అనేక ఆటంకాలు ఏర్పడతాయి,అయినప్పటికీ మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అనవసర విషయాల్లో తల దూర్చకపోవడం ఉత్తమమైన సూచన. కాలాన్ని ఏమాత్రం వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలను మీరు పొద్దగలుగుతారు. శివున్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
సింహం :
ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా అవి టైంకి పూర్తవుతాయి. సమాజంలో కూడా వీరికి గొప్ప పేరు లభిస్తుంది. ఆస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు అందిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు .ఇష్టమైన దైవాన్ని సందర్శించడం వల్ల మేలు జరుగుతుంది.
కన్య :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఒక శుభవార్తను వింటారు. అది వృత్తి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. కీలకమైన విషయాల్లో పెద్దల యొక్క సలహాలను సూచనలు తీసుకుంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాలను చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
తుల :
మనోబలంతోనే మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. కీలకమైన విషయాల్లో తోటి వారి ఆలోచన వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి . శ్రీ లక్ష్మీదేవిని సందర్శించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం :
ఈ రాశి వారికి మిత్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనులు ప్రారంభించిన తర్వాత వాటి నుంచి డైవర్ట్ అవ్వకండి.చంచలత్వం వల్ల ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు అత్యంత ఉత్సాహంతో ఈరోజు పని చేయాల్సి ఉంటుంది. కీలకమైన విషయాల్లో చాలా సున్నితంగా ముందుకు సాగాలి. అష్టమ చంద్ర దోషము ఉంది కాబట్టి దుర్గా ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు :
ఈ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఏ రంగంలో ఉన్నా కూడా విజయాలు మీ ముందుకు వస్తాయి. మనోబలంతో ముందుకు సాగుతారు. విష్ణు సహస్రనామాలను చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు
మకరం :
ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. చిత్తశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా వీరికి ఎప్పుడు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మీయలతో సంతోషకరంగా వీరు కాలాన్ని గడుపుతారు. మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చు.
కుంభం :
ఈ రాశి వారికి దైవ దైవబలం అధికం. గొప్ప ఫలితాలు వీరి సొంతమవుతాయి. ఈరోజు వీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. బంధువుల సహకారం వీరికి మేలు జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా కూడా ఒత్తిడి దగ్గరికి రానీకుండా చూడండి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల శుభం కలుగుతుంది.
మీనం :
ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మనోబలంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్న పాటి సమస్యలు వచ్చే అవకాశముంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.