Today Horoscope : ఆదివారం 26-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

మేషం :
ఈ రాశి వారికి దైవ బలం మెండుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ పని తీరుతో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంది. లక్ష్మి దేవిని పూజించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
వృషభం :.
మీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తి చేస్తారు. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. మీకు సంబంధించిన విషయం కాడి దాంట్లో మీరు అస్సలు తల దుర్చకండి. లేని పోనీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నారాయణుడిని స్తుతించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. మనసుపెట్టి చేస్తే ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. మీకు మిత్రుల వల్ల కూడా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిలో విజయ సాధించినప్పటికీ కష్టముతో దానిని పూర్తి చేస్తారు. అయినప్పటికీ మీరు ముందుకు సాగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. దత్తాత్రేయుడిని స్తుతించడం వల్ల మేలు జరుగుతుంది
కర్కాటకం :
మీరు చేపట్టే పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది మీ పై అధికారులు మీ పనిని చూసి ప్రశంసిస్తారు. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొదవచ్చు.
సింహం :
ఈ రాశి వారికి ఇది శుభకాలం.మనసుపెట్టి ఏ పని చేసినా అందులో నూటికి నూరు శాతం సత్ఫలితాలను పొందగలుగుతారు. ఏ పని ప్రారంభించినా అందులో విజయం మీ వంతు అవుతుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషకరంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
కన్య :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానిని తగ్గించుకునేందుకు ఉత్తమమైన మార్గాలను అన్వేశించాలి. బంధుమిత్రులతో మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. కొన్ని విషయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు మీకు మెండుగా ఉంటాయి. శివుడిని ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
తుల :
ఈ రాశి వారు వృత్తిపరమైన, ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఓ వార్త మీకు తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. అనవసరమైన వాదోపవాదాలకు వెళ్ళకండి. ఈ రాశి వారికి శ్రమ అధికం అయినప్పటికీ విజయాలు సాధిస్తారు. లింగాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చికం :
కుటుంబ సభ్యులతో కలిసి చేసే ఏ పని అయినా సరే తప్పక విజయం సాధిస్తారు.మీకు నచ్చిన పానులను మీరు చేయగలుగుతారు. ఆర్థికపరంగా కూడా మీకు లాభం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తే మీరు జాగ్రత్తగా ఉండడం సూచించదగిన విషయం. సాయి స్మరణ చేయడం వల్ల ఉతమమైన ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు :
కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆహ్లాద కరమైన వాతావరణాన్ని గడుపుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు ఏ పని చేపట్టినా ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తారు. మీ పై అధికారుల నుంచి మీరు ప్రశంశలు పొందుతారు. సుదరాకాండను పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
మకరం :
ఏ రకంగా చూసుకున్నా మీకు విజయమే కనిపిస్తోంది. మీరు అనుకున్న దాని కంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ పని తీరుకు మీ పై అధికారుల నుంచి ప్రశంశలు పొందుతారు. ఓ శుభవార్త మీకు ఎక్కడలేని శక్తిని అందిస్తుంది.ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
కుంభం :
ఈ రాశి వారు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఓ పనిని మీరు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఓ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారికి ఈరోజు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేపట్టినా ముందుగా ఏ అడ్డంకి లేకుండా ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. ఉద్యోగి వ్యాపారి అయినా మీరు అనుకునే విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అతిగా ఎవరిని నమ్మకండి మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ రాముడిని జపించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.