Today Horoscope : శుక్రవారం 24-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించడం అవసరం. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఈ రోజు మీరు మంచి కార్యక్రమాలను చేపడతారు. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
వృషభం :
ఈ రాశి వారికి మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉంటాయి. పక్కవారిని కలుపుకుపోతూ ముందుకు వెళుతూ ఉంటారు. అలా వెళ్లడం వల్ల చాలా వరకు ఇబ్బందులు వీరికి తగ్గిపోతాయి.చుట్టూ వాతావరణం కూడా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముందుగా మనో బలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రమతో కూడిన ఫలితాలు గోచరిస్తున్నాయి. చంద్ర ధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
మిథునం :
ఈ రోజు ఈ రాశి వారికి చాలా దివ్యంగా ఉంది ఇది. అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అభివృద్ధి కనిపిస్తుంది ఒక శుభవార్త వింటారు. అది మీకు, మీ కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీకు చాలా ఉత్సాహకరమైన రోజేనే చెప్పవచ్చు. బంధువులు, స్నేహితులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వారితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు ఈ రాశి వారు కనకధార స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
కర్కాటకం :
సందర్భానికి తగ్గట్లుగా ఈ రాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి బుద్ధిబలం బాగుంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తారు. చెప్పుడు మాటలు అసలు వినకండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి గమనించగలరు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
సింహం :
ఈ రాశి వారికి ఇది శుభకాలం. మనసుపెట్టి ఏ పని చేసినా అందులో నూటికి నూరు శాతం సత్ఫలితాలను పొందగలుగుతారు. మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధించే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా గడపాలనుకుంటారు. ధనయోగం ఉంది. మీ కృషికి తగ్గ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈశ్వరుని దర్శించుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందగలరు.
కన్య :
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితేనే సత్ఫలితాలు పొందుతారు. అయితే పనులు పూర్తి చేయడం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం తిరుగులేని విధంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా అవి శాశ్వతంగా నిలబడవు. చంద్ర ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
తుల :
ఈ రాశి వారు ఏ పని చేసినా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. గత అనుభవాలతో విజయాలను పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసరిస్తారు. చంద్రశేఖరాష్టకం చదవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చికం :
ఈ రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి బాటలు పడతాయి. మీరు ఈ రోజు ఓ శుభవార్తను వింటారు అదేవిధంగా నూతన వస్తువులను కూడా మీరు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం కూడా మీకు బంధుమిత్రుల నుంచి అందుతుంది. ఇష్టదైవరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనుస్సు :
మనసుపెట్టి చేసే ఏ పనైనా సరే మీరు అందులో కచ్చితంగా విజయాలను సొంతం చేసుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగుతారు. తోటి వారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి తగినట్లుగానే వ్యయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. శివనామ స్మరణ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలరు
మకరం :
ఈ రాశి వారికి ఇది సానుకూలమైన సమయం. మీరు చేపట్టే పనుల్లో విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వారిస్తుంది. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలని మీరు పొందగలుగుతారు. మీ కెరీర్ కి సంబంధించి ఒక శుభవార్తలు వింటారు. స్థిర నిర్ణయం లేకపోవడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్న తెరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. దుర్గా అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు.
కుంభం :
మీ కోరికలు నెరవేరే కాలం ఇది. మీ మీ రంగాల్లో విజయాలను మీరు పొందుతారు. మీ పై అధికారులు మీకు ఏ పని అప్పజెప్పినా దానిని సమర్థవంతంగా పూర్తి చేసి, వారి ప్రశంసలు పొందుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓ శుభవార్త వింటారు. ఇది ఇంటిలోని వారికి ఆనందాన్ని అందిస్తుంది. అదేవిధంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మీకు మెండుగా లభిస్తాయి. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. ఇష్టమైన దైవాన్ని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.
మీనం :
ఈ రాశి వారు ఓర్పుతో ఉండాల్సిన సమయం ఇది. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. ఏ పని చేసినా ఆచి తుచి వ్యవహరించాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అలోచించి మాట్లాడాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.