Categories: LatestNews

Today Horoscope : ఈ రాశుల వారు ఈ రోజు తీసుకునే కీలకమైన నిర్ణయాలు వారి భవిష్యత్తునే మారుస్తాయి

Today Horoscope : సోమవారం 16-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
today-horoscope-16-03-2023

మేషం :

ఈ రాశి వారికి ఈ రోజు దివ్యంగా ఉంది మరో ధైర్యంతో ఏ పని చేపట్టినా వెంటనే అందులో సత్ఫలితాలను సాధించగలుగుతారు. ఇష్టమైన వారితో ఈరోజు ఎక్కువ సమయాన్ని గడుపుతారు మనశ్శాంతిని పొందుతారు. కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల్లో తొందరపాటుతనం పనికిరాదు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాన్ని చదవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
వృషభం :
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అయినప్పటికీ వాటిని పూర్తి చేసేందుకు మీరు కృషి చేస్తారు. ఈ రాశి వారు చంద్ర ధ్యానం చేయడం అనేది చెప్పదగిన సూచన.
మిథునం :
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఒక శుభవార్త మీ ఇంట్లో వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో చక్కగా గడపడంతో పాటు, వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే ప్రయాణాలు ఏవైనప్పటికిని అవి మీకు అనుకూలంగానే ఉంటాయి. శివనామస్మరణ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు
కర్కాటకం :
కొత్త పనులను ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పెద్దలు మీకు ఇచ్చిన ఆశీర్వచనాలు కచ్చితంగా పనిచేస్తాయి. చిన్న విషయంలో అయినా సరే సమస్య అని అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానికి పరిష్కారాన్ని వెంటనే చూడాలి. బంధువుల విషయాల్లో ఎంత దూరం ఉంటే అంత మంచిది వారితో ముట్టిముట్టినట్టే ఉండాల్సి ఉంటుంది. శివుడిని ఆరాధించడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.
సింహం :
ఈ రాశి వారు ఈ రోజు స్థిరమైన నిర్ణయాలను తీసుకుంటారు తద్వారా అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. తోటి వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయి. బంధుమిత్రులతో ఈరోజు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీరు చేసే ప్రయాణాలు మీకు సత్ఫలితాలను అందిస్తాయి. శ్రీ విష్ణు నామాలను చదవడం ఉత్తమమైన సూచన.
కన్య :
ఈ రాశి వారికి ఈ రోజు దివ్యంగా ఉంది మంచి ఫలితాలను పొందగలుగుతారు.ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రారంభించిన ఏ పనిలో అయినా సరే కుటుంబ సభ్యుల సహకారం వల్ల విజయాలను సాధించగలుగుతారు.అయితే ముఖ్యమైన విషయాల్లో చంచల మైన మనస్తత్వం పనికిరాదు. స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
తుల :
ఈ రాశి వారు చేపట్టే పనుల్లో ఆపదలు ఎక్కువగా ఎదురుపడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఉద్యోగంలో ఆత్మ స్థైర్యముతో ముందుకు వెళితేనే ఫలితాలను పొందగలరు. అయినవారితో అంటి అంటనట్టు ఉండడమే మంచిది. వారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవసరానికి మించి ఖర్చులను చేయకూడదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత ముఖ్యం. మనస్సు ను స్థిరంగా ఉంచుకొని పనులను చేపట్టాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం :
ఈ రాశి వారికి మనోధైర్యం అధికం అందుకే ఏ పని చేపట్టినా కూడా ఆ ధైర్యంతోనే పూర్తి చేస్తారు. ఈరోజు మీరు తోటి వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు అదే విధంగా బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడి వారితో సాకేతం పెంచుకుంటారు కీలకమైన విషయాల్లో చర్చలు ఫలిస్తాయి.ఇష్టదైవారాధన చెప్పదగిన సూచన.
ధనుస్సు :
ధర్మం మనం పాటిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అనుకునే స్వభావం మీ రాశి వారిలో ఉంటుంది అందుకే ధర్మచింతనతో వీరు వ్యవహరిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వారి ఆరోగ్యం కాస్త సహకరిస్తూ ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు నలుగురికి ఎంతో ఆదర్శంగా నిలుస్తారు. మీకు దైవ బలం అధికం. అదే మిమ్మల్ని రక్షిస్తుంది ఇష్ట దైవారాధన శుభదాయకం.
మకరం :
ఈ రాశి వారు కొన్ని కీలకమైన వ్యవహారాల్లో సమాచారం లోపల లేకుండా ముందు జాగ్రత్త వహించాలి. వృత్తి,ఉద్యోగం వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. అయినా మనోబలంతో మీరు ముందుకు వెళ్తారు. మీరు చేపట్టిన ఏ పనుల్లో మీకు అనుకూలత అధికంగా ఉంటుంది మంచి ఫలితాలను పొందుతారు. అయితే ముఖ్యంగా ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఇష్ట దైవరాధన చెప్పదగిన సూచన.
కుంభం :
ఈ రాశి వారు ఈ రోజు మిత్రులు,సన్నిహితులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా అధికంగానే ఉన్నాయి. మంచి మనసుతో చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇస్తాయి. వినాయకుడిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
మీనం :
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తోటి వారి సహకారాలు ఎల్లప్పుడూ వీరికి అందుతాయి. వీరి బుద్ధి బలంతోనే ఎన్నో కీలకమైన సమస్యలను అధిగమిస్తారు. వాటికి పరిష్కారాలను చూపి అందరిని మనసులను గెలుచుకుంటారు. వీరి ప్రయాణాలు ఫలిస్తాయి గణపతిని ఆరాధించడం చెప్పదగిన సూచన.
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.