RGV: రామ్ గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీలకి కేరాఫ్ అనే సంగతి అందరికి తెలిసిందే. అతను ఏం చేసిన అది తన కోసం మాత్రమే చేసుకుంటాడు. అలాగే ఆర్జీవీ చేసే పనులతో మీడియా దృష్టి తనపై పడేలా చేసుకుంటాడు. అస్సలు సమాజాన్ని లెక్కచేయడు. తాను ఎలా ఉండాలని అనుకుంటాడో అలాగే ఉంటాడు. తన సంతోషం కోసం అమ్మాయిలతో తిరుగుతాడు. ఇక ఆర్జీవీ దృష్టిలో పడితే చాలు పాపులర్ అయిపోవచ్చు అనుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అలా అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి గుర్తింపు తెచ్చుకున్న వారే ఆషు రెడ్డి, అరియానా గ్లోరి. ఈ బ్యూటీస్ ఆర్జీవీతో చేసిన రొమాంటిక్ ఇంటర్వ్యూలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ జెనరేషన్ లో యూత్ కూడా చాలా మంది ఆర్జీవీని విపరీతంగా లైక్ చేస్తూ ఉంటారు.
సమాజాన్ని లెక్క చేయకుండా తన సంతోషం కోసం బ్రతకడం ఎలానో ఆర్జీవీని చూసి నేర్చుకోవాలని అంటారు. అయితే ఆర్జీవీ అప్పుడప్పుడు చేసే కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతాయి. అతను కారణంగా మిగిలిన వారు చిక్కుల్లో పడుతూ ఉంటారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ ఓ సెమినార్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. అక్కడ విద్యార్ధులకి ఏకంగా శృంగార పాఠాలు చెప్పడం విశేషం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవి శృంగారం, ఆహారం. మనిషి వీటి కోసమే బ్రతుకుతున్నాడు. అయితే సమాజంలో గురువులు, తల్లిదండ్రులు మనల్ని కంట్రోల్ లో ఉంచాలని అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అని చెప్పి దానికి ఏవో కండిషన్స్ పెడతారు.
వాటిని ఎట్టి పరిస్థితిలో ఫాలో అవ్వొద్దు అని చెప్పారు. మీకు నచ్చినట్లు మీరు బ్రతకండి. మీ సంతోషాన్ని అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. శృంగారం చేయాలనిపిస్తే చేసేయండి, తాగాలని అనిపిస్తే తాగేయండి. చనిపోయిన తర్వాత స్వర్గం వెళ్ళడానికి ఇప్పుడు మంచి పనులు చేయాలని అంటారు. స్వర్గంలో ఉన్నది రంభ, ఊర్వశి మేనకలే. అయితే నిజంగా వారు ఉంటారో లేదో తెలియదు. అందుకే ఇప్పుడు స్వర్గంలో ఉన్న సంతోషాలని ఆశ్వాదిస్తున్నా అని పేర్కొన్నారు. ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.