Categories: LatestNews

Today Horoscope : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా తిరుగుండదు

Today Horoscope : సోమవారం 15-03-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
today-horoscope-15-03-2023
మేషం :
అంతా బాగుంది కదా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు ప్రతిరోజు ప్రతిక్షణం భద్రత జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఏదైనా పని తలపెట్టదలచితే మీ తోబుట్టువులకు కచ్చితంగా తెలియజేయండి. వారి సహకారం ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఎవరితో వాదనలకు దిగకుండా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే ఇంచు కూడా కదలలేరు. మీ ఆఫీస్ పనులు నిర్వహించడానికి ఈరోజు అంత ఆసక్తి చూపించారు. ఏదో డైలమాను ఎదుర్కొంటారు. దుర్గాదేవిని దర్శించుకోవడం శుభదాయకం.
వృషభం :
మీరు ఏ పని చేపట్టిన కాలు అనుగుణంగానే ముందుకు వెళ్లాలి అంతా మీకు మంచే జరుగుతుంది. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవి మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి. వృధా ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమాన్ చాలీసా లేదా హనుమన్ ఆరాధన వల్ల శుభం కలుగుతుంది.
మిథునం :
మీరు ఎంతటి తెలివైన వారైనా సరే తోటి వారి సూచనలను సలహాలను పాటించడం ఉత్తమం. మీ పరిధిలోకి రాని విషయాల గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు వాటి గురించి చర్చలు జరపాల్సింది కూడా లేదు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. ఏదైనా కొత్త వ్యాపారం చేపట్టాలనుకుంటే ఆ ఆలోచనని మీ మిత్రులతో లేత బంధువులతో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను గురించి అంచనా వేయవచ్చు. ఈరోజు మీరు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
కర్కాటకం :
ఈ రాశి వారికి ఈ రోజు దివ్యంగా ఉంది. శుభ ఫలితాలను పొందుతారు. కొన్ని కొన్ని కీలకమైన విషయాల్లో నిర్ణయాలను సొంతంగా తీసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మీకు విజయాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఈ రోజు విష్ణును దర్శించుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.
సింహం :
ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమయానికి అనుకూలంగా మీరు మీ పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఏదైనా సమస్యలను ఎదుర్కొంటుంటే అవి తొలగి కాస్త ఊరట చెందుతారు. శుభకార్యాల ద్వారా ఈరోజు మీకు ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. శుభ ఫలితాల కోసం అమ్మ వారిని ఆరాధించి గోమాత సేవ చేయడం ఉత్తమమైన పరిష్కారం.
కన్య :
కన్య రాశి వారు ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఊహించని సమస్యలు మీకు ఎదురవుతాయి. మీరు ఉద్యోగస్తులయితే తోటి ఉద్యోగుల నుంచి సమస్య ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా అది మెళ్లిగా సాగుతుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం చికాకు పుట్టిస్తుంది. అనుకూలమైన ఫలితాల కోసం గరికతో వినాయకుని పూజ చేయడం ఉత్తమమైన పరిష్కారం. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తుల :
ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు మరీ ముఖ్యంగా కీలకమైన వ్యవహారాల్లో ఎలాంటి సమాచారం లోపం లేకుండా చూసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు అనేకం ఏర్పడతాయి.కానీ మనో ధైర్యంతో మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది తప్పక విజయాలు సాధిస్తారు.
వృశ్చికం :
ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ఈరోజు మీరు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులయితే నూతన బాధ్యతలను చేపడతారు. బంధుమిత్రుల సహకారం ఎప్పుడు మీకుంటుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించే ప్రారంభించాలి. లక్ష్మి సహస్రనామాలు చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి.
ధనుస్సు :
ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంది ఏ పని ప్రారంభించినా అందులో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మానసిక సంతోషంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. శుభకార్యాలతో పాటు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు నీకు సానుకూలంగా ఉన్నప్పటికీ విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుతారు.
మకరం :
ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు ఒకవేళ ఉద్యోగస్తులయితే మీరు కలలు కన్న ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అనుకోని విధంగా గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. తద్వారా మీరు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు. మీ వెంటే దైవ బలం ఉంది ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆరోగ్యం పైన ఎలాంటి అశ్రద్ధ వహించకండి. సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుతారు.
కుంభం :
కుంభ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీకు తోటి వారి సహకారాలు పుష్కలంగా అందుతాయి. మీ బుద్ధి బలంతోనే ఎన్నో కీలకమైన సమస్యలను పరిష్కరించి పై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. మీరు చేపట్టిన ప్రయాణాలు ఫలితాలని అందిస్తాయి గణపతిని ఆరాధించడం ఉత్తమం.
మీనం :
ఈ రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంది ఈరోజు మీరు సానుకూలమైన ఫలితాలను పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనితనం ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏదైనా కీలకమైన వ్యవహారాలను మీరు చేపట్టదలిచితే వెనకడుగు వేయకండి మనో బలంతో ముందుకు సాగండి. ఏదైనా నిర్ణయం ఒకసారి అనుకుంటే దానిని అనుసరించండి స్థిరమైన నిర్ణయాల ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీరు గోవింద నామాలు చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

10 minutes ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

18 hours ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

2 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

4 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

4 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 days ago

This website uses cookies.