Wed. Jan 21st, 2026

    Dengue: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పెద్ద ఎత్తున దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అయితే ఈ దోమ కాటు వల్ల మనం ఎన్నో రకాల జబ్బులకు గురి అవుతాము. ప్రస్తుతం ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా మంది జ్వరాల బారిన పడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ముందుగా మనం ఈ భయంకరమైనటువంటి వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం ముఖ్యంగా దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.

    ఇక ఎవరైతే డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంటారో అలాంటివారు ఈ వ్యాధి నుంచి బయటపడాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువ శాతం పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం ఇవ్వడమే కాకుండా మన శరీరంలో రక్త కణాల సంఖ్యను పెంపొందింప చేస్తాయి. దీంతో తొందరగా ఈ డెంగ్యూ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. మరి డెంగ్యూ వ్యాధితో బాధపడేవారు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయానికి వస్తే…

    బొప్పాయి ఆకులు డెంగ్యూతో పోరాడడానికి మంచి ఔషధంగా సూచించారు. బొప్పాయి ఆకుల రసం మన శరీరంలో ప్లేట్లెట్స్ పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం అందుకే అరటి పండును తీసుకోవడం వల్ల తొందరగా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు ఇందులో ఉన్నటువంటి పొటాషియం, విటమిన్ b6, మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి అనారోగ్యం నుంచి కొలుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితోపాటు దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ కివి ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడమే కాకుండా మన శరీరంలో ప్లేట్లెట్స్ పెరిగి తొందరగా ఈ వ్యాధి నుంచి బయటపడతాము.