Chicken: ఇటీవల కాలంలో చాలామంది చికెన్ తినడానికి ఇష్టపడుతున్నారు. చికెన్ లేకుంటే ఒక్క పూట కూడా ఉండలేని పరిస్థితి తలెత్తింది. ఇలా ముక్క లేనిదే చాలామందికి ముద్ద కూడా దిగదు. ఇలా చికెన్ అంటే ఎంతో ఇష్టం ఉండేవారు చికెన్ వివిధ రకాలుగా తయారు చేసుకుని తినడం మనం చూస్తుంటాము. ఇక చికెన్ లో ఎన్నో రకాల ప్రోటీన్లు విటమిన్లు మనకు పుష్కలంగా లభిస్తాయి. కనుక ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఆరోగ్యానికి మంచిది కదా అని చికెన్ అధిక మొత్తంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి.
ముఖ్యంగా చికెన్ అంటే ఇష్టం ఉన్నటువంటి వారు ఇటీవల కాలంలో నాటీ కోళ్లను పెంచుకొని తినడం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో బాయిలర్ కోళ్లని అధికంగా తింటున్నాము. ఇలా బాయిలర్ కోళ్లు తినేవాళ్లు ముఖ్యంగా ఈ భాగాన్ని అధికంగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి చికెన్ లో ఏ భాగం ఎక్కువగా తినటం వల్ల గుండెజబ్బులు వస్తాయి అనే విషయానికి వస్తే..
చికెన్ చర్మం చాలామంది సపరేట్గా ఫ్రై చేసుకుని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలా ఎప్పుడైతే చికెన్ చర్మం తింటున్నారు అందులో ఉన్నటువంటి రసాయనాలు గుండెకు హానికరంగా మారుతాయిని నిపుణులు చెబుతున్నారు.చర్మంలో ఎక్కువ భాగం కొవ్వు కలిగి ఉంటుంది అంతేకాకుండా చికెన్ తాజగా ఉండడం కోసం కోళ్లు త్వరగా బరువు రావడం కోసం వాటికి ఇంజక్షన్లు కూడా వేస్తారు కనుక ఈ హానికర రసాయనాలు చర్మంలోనే ఉంటాయి. అందుకే చర్మం తినటం వల్ల మన గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాకుండా గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఈ కోళ్ల చర్మంలో ఉన్నాయి. అయితే గుండె జబ్బులతో బాధపడేవారు కోడి చర్మం తినకపోవడం మంచిదని ఆరోగ్యంగా ఉన్నవాళ్లు నెలకు ఒకసారి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.