Beauty Tips: పుదీనా ఆకుల్లో ఉండే అద్భుత ఔషధ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఘాటైన సువాసన, అద్భుత ఔషధాలు కలిగిన పుదీనా ఆకులతో చర్మ అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించుకొని సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకొని వృద్ధాప్య ఛాయలను అధిగమించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
తరచూ చర్మ సమస్యలతో బాధపడేవారు పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులోకి తగినన్ని రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ముఖ చర్మం , మెడ భాగంలో సున్నితంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి మూడుసార్లు చేసుకుంటే చర్మంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు తగ్గి సహజ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
పుదీనా, నిమ్మరసం ఉపయోగిస్తే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీనికోసం పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులోకి నిమ్మ రసాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ముఖ చర్మం , మెడ భాగంలో సున్నితంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో సహజ సిద్ధంగా కనపడుతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.