Wed. Jan 21st, 2026

    Sivarathri: మహాశివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే ఈ పండుగ రోజు చాలామంది శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటూ స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు అయితే ఈ పండుగ రోజు స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శివరాత్రి పండుగ రోజు స్వామివారికి అర్చనలు చేయడమే కాకుండా ఉపవాస జాగరణలను ఆచరించడం వల్ల కూడా స్వామివారి ఆశీస్సులు మన పైనే ఉంటాయి.

    ఇక స్వామివారికి ఉపవాసం చేసే సమయంలోను జాగరణ చేసే సమయంలోను కొన్ని జాగ్రత్తలను పాటించాలి అలాగే అర్చన చేసే సమయంలో కూడా కాస్త జాగ్రత్తలను పాటించాలి స్వామి వారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా పసుపు కుంకుమలతో అభిషేకం చేయకూడదు అలాగే తులసి దళాలతో అభిషేకం చేయకూడదు. శివుడికి ఎప్పుడూ కూడా బిల్వదలాలతో అభిషేకం చేయడం మంచిది. ఇక పాలతో అభిషేకం చేయాలనుకునే వారు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ఆవుపాలతో అభిషేకం చేయడం మంచిది.

    ఇక ఉపవాసం ఉండేవారు ఎలాంటి పరిస్థితులలో కూడా వెల్లుల్లి ఉల్లిపాయతో చేసిన ఆహార పదార్థాలను అసలు ముట్టుకోకూడదు కేవలం పండ్లు స్వామి వారికి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాలను మాత్రమే తినాలి ఇక జాగరణ సమయంలో కూడా శివ చాలీసా చదువుతూ భజనలు చేసుకుంటూ ఆ శివయ్యను స్మరిస్తూ తెల్లవార్లు జాగరణ చేయాలి తప్ప మాటలు పెట్టుకోవడం, ఆటపాటలతో శివరాత్రి జాగరణ చేయకూడదని ఇలాంటి జాగరణ చేసిన ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు చెబుతున్నారు.