Tirumala: కలియుగ దైవం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని ఇలవైకుంఠంగా పరిగణిస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రజలు సుదూర ప్రదేశాల నుండి తిరుమలకు చేరుకుంటారు. అయితే భక్తుల సౌకర్యం టిటిడి ఎప్పటికప్పుడు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టిటిడి స్పష్టం చేసింది.
సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చివరి గడువు రోజున మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. అయితే ఈ టికెట్లు పొందిన వారు టిటిడి నిర్ణయించిన ధర చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అలాగే కోటా:వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత దర్శనం కోసం మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Tirumala:
అలాగే మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటుగా తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు, అలాగే తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా టీటీడీ యాప్ లో ఈ ఆన్ లైన్ కోటా ప్రత్యక ప్రవేశ దర్శనం టికెట్ల తో పాటు వసతి కోటాను బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.