Categories: Devotional

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతూ ఉంటాయి. అయితే తిరుమలలో స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాలు త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో అందుకు అని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి నగలను సమర్పించడం గత దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే నారాయణ వనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఏకంగా 33 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను సమర్పించారు.

ఇలా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ఆలయం నుంచి కల్యాణ వెంకటేశ్వర స్వామికి నగలను పంపించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే స్వామివారి ఆలయం నుంచి నారాయణ వనంకు పంపించిన ఆభరణాలలో శీమ కమలాలు, నవరత్న పూసలతో కూడిన రెండు పేటల బంగారు హారం, బంగారు లక్ష్మీకాసుల మాల ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తరఫున ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ ఆభరణాలను నారాయణవనం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నకు అందజేశారు.

శ్రీవారి ఆలయం నుంచి నారాయణవనం ఈ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి, మూలమూర్తి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ప్రతి ఏడాది ఇలా కళ్యాణ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి నగలను పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి వంటి తదితరులు పాల్గొన్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.