Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి అయినప్పటికీ తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎప్పటిలాగే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లు భక్తులతో నిండి పోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు విస్తరించాయి.
టీటీడీ అధికారులు చెప్పిన వివరాల మేరకు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు సుమారు 18 నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని తెలిపారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని తెలుస్తుంది. వేసవి సెలవులు దాదాపు పూర్తి అయి తిరిగి స్కూల్స్ కాలేజీలు ప్రారంభమైనప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.
తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే ఏకంగా 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 42,566 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లకు చేరగా, టీటీడీ 4.34 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు ఉదయానికే పూర్తయ్యాయి. దీంతో ముందస్తు టోకెన్లు లేని భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ అధికారులు ఏ విధమైనటువంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం ఆహారం తాగునీరు పాలు వంటి పదార్థాలను అందచేసేలా ఏర్పాటను నిర్వహించారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.