Health: వేసవి వచ్చింటే జదంనం కొంత కంగారుపడతారు. మారుతున్న కాలంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా వేసవికాలంలో సూర్యతాపం మరింత ఎక్కువ అవుతుంది. ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దాంతో గాల్లో తేమ శాతం కూడా విపరీతంగా తగ్గిపోతుంది. ఈ కారణంగా వేసవికాలంలో ఎండలోకి వెళ్ళామంటే క్షణాల్లో ఒళ్లంతా చెమట పట్టేసి స్నానం చేసినట్లు శరీరం అయిపోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
ఈ సమయాల్లో బయటకి వెళ్ళాలంటే అందరూ భయపడిపోతారు. చెమట ఎక్కడం సాధారణమైన విషయమే అయిన. ఈ చెమట కారణంగా ఒంటి నుంచి ఎక్కడ లేని దుర్వాసన వస్తుంది. దానికితోడు ఒంట్లో ఉన్న నీరు మొత్తం చెమట రూపంలో బయటకి పోతే వేగంగా అలసటకి గురికావడం జరుగుతుంది. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వేసవికాలంలో ఎండ తాకిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకి వెళ్లొద్దు అని డాక్టర్లు సూచిస్తారు.
తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తే మనతో పాటు వాటర్ బాటిల్, గ్లూకోజ్ వంటి ఎనర్జీ డ్రింక్స్ కచ్చితంగా పట్టుకోవాలని చెబుతారు. ఇక వేసవికాలంలో గాలి సరిగా లేకపోవడంతో ఇంట్లో ఉన్న కూడా చెమట పట్టేస్తుంది. ఇక ఈ చెమట కారణంగా చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వేసవికాలంలో చెమటని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే చెమట సమస్య కొంత వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.
గ్లాస్ నీటిలో వెనిగర్ ని కలిపి అందులో కాటన్ ముంచి చెమట ఎక్కువగా పట్టే గొంతు, చంకలు, చేతులు, అరికాళ్ళపై మర్దన చేసుకోవాలి. నిద్రపోయే సమయంలో ఇలా చేసుకొని ఉదయాన్నే స్నానం చేస్తే శరీరానికి చమట ఎక్కువగా పట్టే అవకాశం లేదు. అలాగే టమటాలో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ప్రతి రోజు ఒక గ్లాస్ చొప్పున ఒక వారం రోజులు తీసుకుంటే చెమట పట్టడం తగ్గుతుంది. అలాగే వేసవికాలంలో ఆయిల్ ఫుడ్స్ వీలైనంత తక్కువ తినాలి. అలాగే కారం, ఉప్పుని కూడా మితంగా తినడం వలన చెమట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.