Categories: Tips

Health: చిన్న పిల్లలకు ఎక్కువగా ఐస్‌క్రీంస్, ఛాక్లెట్స్ ఇస్తున్నారా..అయితే ఈ సమస్యలు తప్పవు..!

Health: వేసవి కాలంలో ఎండల వేడిమి మామూలుగా ఉండదు. భానుడి ప్రతాపానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఈ సంవత్సరం ఎండలు మరీ మండిపోతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఉక్కపోతతో కూడిన వేడి ప్రజలను అల్లడిస్తొంది. దీనితో చల్లదనం కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. గంటల తరబడి ఏసీలు వేసుకోవడం., చల్లని పానీయాలు తాగడం, ఐస్ క్రీమ్ లు తినడం వంటివి చేస్తూ కాస్త సేద తీరుతున్నారు. నిజానికి ఇలా చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టే హిమక్రీ ములు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం అంత మంచి విషయం కాదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిని తినడం తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు. అవేమిటో మనమూ తెలుసుకుందాము.

వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వేసవిలో ఐస్ క్రీమ్ లు తినడానికి ఇష్టపడతారు. కారణం అవి రుచికరంగా ఉండటం. ఐస్ క్రీమ్ లు టేస్టీ గా ఉంటాయి కాబట్టి కొంత మంది ఏకంగా డబ్బాలు డబ్బాలు లేపేస్తారు. ఐతే ఇలా ఐస్ క్రీమ్ లు ఎక్కువగా తినడం వల్ల ప్రమాదకరమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవు తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌లో ఉండే షుగర్ కంటెంట్, అధిక కొవ్వు పదార్ధాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయంటు న్నారు.

వేసవి వేడిలో ఐస్ క్రీమ్ తినడం వల్ల చల్లగా ఉంటుంది. కానీ అది కొంత సమయం వరకే అది తినడానికి చల్లగా ఉన్నా దాని ప్రభావంతో శరీరంలో వేడి కలిగేలా చేస్తుంది. నిజమే ఎప్పుడైతే ఐస్‌ క్రీమ్ తింటారు కాస్త సమయం అయ్యేసరికి విపరీతంగా దాహం వేస్తుంది. తాత్కాలికం గా ఐస్‌ క్రీమ్‌లు చల్లదనాన్ని కలిగిస్తాయే తప్ప అవి నిజంగా శరీరంలో వేడిని పుట్టిస్తాయి. కేవలం శరీరం లో వేడిని మాత్రమే కాదు వేసవిలో హిమక్రీములు తినడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు, వంటి సమస్యలు విపరీతంగా వేధిస్తాయి. అంతే కాదు థ్రోట్ ఇన్‌ఫెక్షన్‌లు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటుంటారు. అందుకే చిన్నపిల్లలు ఐస్‌క్రీమ్‌లు తిన్నప్పుడలా వారి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి.

tips to be followed in summer to avoid icecreams, chocolates by children

ఐస్‌క్రీమ్‌లు మాత్రమే కాదు చిన్నపిల్లలు మారాం చేసినప్పుడల్లా వారిని కూల్ చేయడానికి తల్లిదండ్రులు విపరీంతగా చాక్లెట్స్ కొనిస్తుంటారు. చెప్పిన మాట వినాలన్నా, చదవాలన్నా, ఏడుపు ఆపాలన్నా పేరెంట్స్ కు ఉన్న మంత్రం చాక్లెట్ మంత్రం. ఏముంది ఒక్క చాక్లెట్ ఇస్తే అని తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ అతిగా ఏమి తిన్నా అనర్థమేనని పేరెంట్స్ గుర్తించాలి. చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల పిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన పంటి నొప్పులతో, పుచ్చుపళ్లతో లేలేత వయస్సులోనే నొప్పులతో బాధపడుతున్నారు.

వీటితో పాటు థ్రోట్ ఇన్‌ఫెక్షెన్‌లు, దగ్గు వంటి సమస్యలు చాక్లెట్స్ తో వచ్చేస్తున్నాయి. సాధారణంగా ఒత్తిడి సమయంలో చాక్లెట్స్ తింటే మంచి రిలీఫ్ లభిస్తుందని అధ్యయనాలు చెబుతుంటాయి. కానీ అవి పెద్దవారికి మాత్రమే అందులోనూ డార్క్ చాక్లెట్స్ మాత్రమే ఒత్తిడిని దూరం చేస్తాయి. కానీ ఏ చాక్లెట్ పడితే అది తినడం వల్ల అవి ఎలా తయారవుతాయో తెలియదు. కానీ పిల్లలు తియ్యగా ఉన్నాయి కదా అని లాగించేస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొంత మంది అక్రమార్కులు చాక్లెట్స్ లో డ్రాగ్స్ కలిపీ మరీ విక్రయిస్తున్నారు. ముక్కు మోహం తెలియని వారు పిల్లలు ఈ చాక్లెట్లు ఇచ్చి కిడ్నాప్‌లు కూడా చేసేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఐస్ క్రీమ్‌లు తినాలని మీరు ప్రోత్సహించకుండా కాస్త శరీరానికి చలువను అందించే పానీయాలను పిల్లలు తీసుకునే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ నీళ్లు వంటి పానీయాలను వారు తాగే విధంగా ప్రోత్సహించాలి. మరీ ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తో మీరే ఇంట్లో జ్యూస్‌లను సిద్ధం చేసి పిల్లలకు అందిస్తే కూడా పిల్లల ఆరోగ్యానికి మేలు చేసిన వారు అవుతారు. వాటినే డీప్‌ ఫ్రిజ్ లో క్యూబ్స్ బాక్సుల్లో పెట్టి ఐస్‌ క్రీమ్‌లుగా తయారు చేసి ఇస్తే ఇంకా ఇష్టంగా తింటారు. అంతేకానీ ఐస్‌ క్రీమ్ టేస్ట్ బాగుంది కదాని అధికంగా ఇచ్చేస్తే ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసుకున్నారు కదా. మరి మీరు మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధగా ఉంటారని ఆశిస్తున్నాము.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.