Categories: Tips

Helping hands: తమ సంపాదనతో చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్న సినీ తారలు..

Helping hands: సినీ తారల సంపాదన అంటే అందరికీ ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వారి లైఫ్‌ స్టైల్, ఇ‌ళ్లు, కార్లు, మెయిన్‌టెనెన్స్‌ను చూస్తే అందరూ అవాక్కవుతారు. వారు వాడే ప్రతి వస్తువు బ్రాండ్‌ కలిగినదై ఉంటుంది. ఎంతో లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తుంటారు ఈ తారలు. ఇంత మంచి లైఫ్ వచ్చిదంటే అది ఊరికే రాదు. వారు పడే కష్టం, జనాల ను ఇంప్రెస్ చేసేందుకు వారు చూపే తపన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు ఉన్నారు. కానీ కొంతమందే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే కొంత మంది హీరోలు, హీరోయిన్‌లు స్క్రీన్ మీదే కాదు తెర వెనకాల కూడా నిజమైన స్టార్స్‌గా గుర్తింపబడుతున్నారు. అందుకు కారణం వారు చేసే సామాజిక కార్యక్రమాలే అని చెప్పక తప్పదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ తారలు చాలా మంది తమ సంపాదనతో చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.

అందులో ముందుగా ప్రిన్స్ మహేష్‌ బాబు ఎంతో మంది చిన్నారుల గుండె చప్పుడయ్యాడు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు ఎన్నో సేవాకార్యక్రమాలకు శ్రీకారాన్ని చుట్టి తనలోని మానవీయతను దశదిశలా చాటుతున్నాడు. శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలని సందేశం ఇవ్వడంతో పాటు మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకుని ఆ గ్రామస్వరూపాన్నే మార్చేసాడు. మహేష్‌బాబు వేసిన ఈ ముందడుగు ఎంతో మందిలో స్ఫూర్తిని కలిగించింది. ఈయన ఇన్‌స్పిరేషన్‌తో చాలా మంది స్టార్స్‌, ఎన్‌ఆర్‌ఐలు తమ స్వగ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. తమ సొంతూరునే కాదు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని రియల్ హీరో అని నిరూపించాడు ఈ యువరాజు. గ్రామాభివృద్ధికే కాదు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా చిన్నారులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు మహేష్. భార్య నమ్రత తోడ్పాటుతో ఇప్పటి వరకు 125కుపైగా చిన్నారుల హార్ట్‌ ఆపరేషన్‌ లకు చేయించి తనలోని మానవీయతను చాటుకున్నారు. అంతే కాదు ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మంది చిన్నారుల బాగోగులను చూసుకుంటూ వారికి ఆపద్భాందవుడిగా నిలిచారు.

Movie stars saving the lives of children with their earnings ..

ఇక హీరోలేనా హీరోయిన్‌లు ఏం తీసిపోలేదని తనలోని దాతృత్వాన్ని చాటుకుంది సౌత్ ఎవర్‌ గ్రీన్ హీరోయిన్ సమంత. ప్రత్యూష అనే సంస్థ ద్వారా ఎందరో చిన్నారు లకు ఆపన్నహస్తం అందిస్తోంది. పెళ్లికి ముందే స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు చికిత్స అందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ రియల్ హారోగా నిలుస్తోంది సామ్‌. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎవ్వరు ఏమన్నా వైఫల్యాలు ఎదురైనా, వ్యక్తిగతంగా బాధలు ఉన్నా ప్రత్యూష ఫౌండేషన్‌లోని పిల్లలో ఓ పిల్లలా కలిసిపోయి వారితో ఆనందంగా గడుపుతూ తన జీవనాన్ని స్వర్గధామంగా మార్చుకుంటుంది ఈ స్టార్. సామ్ చేసే సామాజిక కార్యక్రమాలు ఆమెను మరింత స్టార్‌ను చేశాయి. నిజానికి పేద పిల్లల కోసం ఆమె చేసే సేవా కార్యక్రమాలు చూస్తే ఎవరైనా హాట్సాఫ్ చెప్పాల్సిందే. సమంత ..తాను చేసే కమర్షియల్ యాడ్ ఫిలింస్, షాపింగ్ మాల ఓపెనింగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యూష పండేషన్‌కే కేటాయిస్తోంది. అంతేకాదు, సమంత చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల గురించి ఎక్కడా స్వయంగా ప్రచారం చేసుకోకపోవడం గొప్ప విషయం.

కరోనా వంటి విపత్కర సమయంలో రవాణా స్తంభించిపోయింది. ఆర్ధిక పరిస్థితులు కుంటుపడిపోయాయి. ఆదాయం రాక ఉద్యోగం లేక కూలీ పనులు దొరక్క ఎంతో నలిగిపోయారు. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఎంతో మంది పేదవారిని దినసరి కూలీలను తన సొంత డబ్బులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చాడు. అంతే కాదు కరోనా పేషంట్స్‌కు పెద్ద మనుసుతో ముందుకు వచ్చి తనకు చేతనైన సహాయాన్ని అందించాడు. ఒకానొక సమయంలో ఆక్సీజన్ కొరత ఏర్పడినప్పుడు సొంతగా ఓ ఆక్సీజన్ ప్లాంట్‌ను నెలకొల్పి ఎంతో మంది పేషెంట్స్‌కు ఊపిరిని అందించాడు. అంతే కాదు హాస్పటిళ్లల్లో బెడ్స్ ఏర్పాటు చేసాడు. పేదవారికి మందులు, వైద్య సేవలు అందించాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఎవరు సహాయం కావాలని అడిగినా ఏమాత్రం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించాడు సోనూ సూద్. అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

సౌత్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ తన తనువు చాలించి ఈ లోకాన్ని విడినా ఇంకా ఎంతో మంది హృదయాల్లో నిలిచి ఉన్నాడంటే దానికి కారణం ఆయన చేసిన సేవా కార్యక్రమాలే అని చెప్పక తప్పదు. ఆయన మరణించిన సమయంలో వచ్చిన జనసంద్రాన్ని చూస్తే ఆయనపై ప్రజలు ఏర్పరుచుకున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. పునీత్ ఎంతో బిజీ స్టార్ అయినా ఆయన పేద ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప తపనతో ఉండేవాడు. ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నో అనాధా శ్రమాలు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, గోశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు చెప్పడంతో పాటు పేదవారికి ఆపన్నహస్తం అందించాడు. ఆయన బ్రతికున్నప్పుడే కాదు మరణాణంతరం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలను 8 కోట్లు డిపాజిట్ చేశారు. అంతే కాదు తన అవయవాలను దానం చేశారు. ఇలాగే వెండితెర పైన స్టార్‌లే కాదు నిజ జీవితంలోనూ స్టార్స్‌గా నిలుస్తూ ఎందరో చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం చూపుతున్నారు.

ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేరుగా సోషల్ మీడియా ద్వారా గానీ, సమంత.. మహేశ్ బాబు..సోనూసూద్ ఫౌండేషన్ మెంబర్స్‌ను గానీ కలిసి ఎలాంటి ఇబ్బందు లున్నాయో పూర్తి వివరాలను అందిస్తే వారు అందుకు తగిన సహాయాన్ని అందిస్తున్నారు. ఎలాంటి సమయంలోనైనా వీరిని సంప్రదించవచ్చును.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.