Categories: Tips

Food: ఫాస్ట్ ఫుడ్‌కు అట్రాక్ట్ అవుతున్న పిల్లలు, పెద్దలు

Food: ఒకప్పుడు ఇంట్లో ఏం వండితే అదే తినేవారము. ఉదయం టిఫిన్స్ కూడా ఉండేవి కావు. పొద్దున్నే చక్కగా పెరుగన్నంతో కడుపునింపుకుని మధ్యాహ్నం కూరన్నం, ఆ తరువాత సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ అన్నం తిని హాయిగా ఉండేవారము. ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినా, ఆకలిగా ఉన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఇంట్లోనే తయారు చేసే చిరుతిండ్లను చక్కగా బొజ్జనిండా భుజించేవారము. కానీ కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఇంట్లో తినే తిండిని కాస్త ఆటవిడుపు కోసం హోటళ్లలో తినడం ప్రారంభించాము.

అక్కడితో భోజన ప్రియుల ఆహారపు అన్వేషణ ఆగిపోలేదు. పక్క దేశాల వారు ఇక్కడ మకాం వేసి వారి ఆహారాన్ని అలవాటు చేసేసారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసుల వల్ల ఇంట్లో వండుకుని తినడం ఎందుకు దండుగ చక్కగా ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే పోలా అన్న సంస్కృతికి చేరుకున్నాము. పోనీ ఆన్‌లైన్‌లలో ఏమైనా ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామా అంటే అదీ లేదు. పిజ్జాలని, బర్గర్లని, నూడిల్స్ అని బిర్యానీలని రోజులకు తరబడి తింటూ భారతీయ జీవన ఆహార శైలిని విపరీతంగా మార్చేశాము.

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఇప్పుడు అందరూ ఈ ఫాస్ట్ ఫుడ్స్‌ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తినడానికి రుచికరంగా ఉండటంతో పాటు చూడటానికి అట్రాక్టివ్‌గా ఉండటం. రోజూ ఇంట్లో తినే ఆహారం కాకపోవడంతో అందరూ వాటి రుచికి టెంప్ట్ అయ్యి ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. నిజానికి అన్నానికి మించిన పరబ్రహ్మం మరొకటి లేదు. మనం ఎన్నో ఏళ్లుగా అన్నాన్ని తింటూ వస్తున్నప్పటకీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వెన్నాడలేదు. కానీ ఈ మధ్య కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్ తినడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు.

why children and adults are attracted towards fast food

నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్స్‌ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్సే. రోజుల తరబడి వాటిని స్టోర్‌ రూమ్‌లలో నిల్వ ఉంచి వండుతారు. అంతే కాదు అవి పాడవకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లలో పెడతారు. ఇక ఇవి రుచికరంగా ఉండేందుకు టేస్టింగ్ సాల్ట్స్ కలుపుతారు. అయినా అందరూ భలేగా ఉందంటూ లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. అంతే కాదండోయ్ సుమారు 30 నుంచి 40 శాతం వారి సంపాదించిన డబ్బును ఇలా రెస్టారెంట్‌లకు, తిండికే ఖర్చు చేస్తారని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఫాస్ట్ ఫుడ్స్, మన ఆరోగ్యంపై అనేక ప్రభావాలు చూపుతాయి. ముందుగా డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతాయి. అధిక మొత్తంలో కార్బ్స్ ను విడుదల చేసి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుకుంది. తద్వారా డయాబెటీస్ వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు అసిడిటీ, అరుగుదల లేకపోవడం, కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రైడ్ పీస్‌, పేస్ట్రీలు, పిజ్జాలు, కేక్స్, కుక్కీలు అన్నింట్లో కూడా హెవీ షుగర్, ఫ్యాట్ కంటెంట్లు ఉంటాయి. వీటిని విపరీతంగా తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో ఈ మధ్య ఊబకాయం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

పెద్దవారు కూడా ఈ అనారోగ్య సమస్యలకు నిమిత్తం ఏమీ కాదు. ఊబకాయ సమస్యల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో ఫ్యాట్, షుగర్ తో పాటు సోడియంను అధికంగా వినియోగిస్తారు అందుకే ఈ ఆహార పదార్ధాలు టేస్టీగా ఉంటాయి. కొద్దిగా వీటిని ఆహారంగా తీసుకున్నా కడుపు ఉబ్బరంగా, ఇబ్బందిగా ఉంటుంది. వారంలో రెండు మూడు సార్లు ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఛర్మ సంబంధిత సమస్యలు వస్తాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఫాస్ట్ ఫుడ్స్‌ను రెస్టారెంట్‌లలో తినేప్పుడు బిల్ లో ఎంత ఫ్యాట్ ఉంది ఏం కంటెంట్ ఇందులో ఉంది క్లియర్‌గా తెలుపుతారు. అది చూసి కూడా చూడనట్లు టేస్టీగా ఉన్నాయి కదా అని లాగించేస్తాము. నిజానికి ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల మన హోమ్ ఫుడ్ టేస్ట్‌ను చాలా మిస్ అవుతున్నాము. ఇంట్లో వండే వాటిలో ఎలాంటి పౌడర్లు వాడకుండా సురక్షితంగా, ఆరోగ్యంగా వండినా ఒంటికి ఎక్కవు. అందుకే చాలా మంది బయటి ఫుడ్‌కి వెంపర్లాడుతుంటారు. ఇప్పటికైనా ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ఇంటి ఫుడ్ తినడానికి మాత్రమే అలవాటు పడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరికిరావు. జేబుకు వేలకు వేలు చిల్లు పడదు.

 

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.