Kitchen Tips: సాధారణంగా కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. కానీ కాకరకాయలు తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాకరకాయ చేదుగా ఉన్న నేపథ్యంలో కాకరకాయను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. అయితే కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల కాకరకాయలో ఉన్న చేదును తగ్గడమే కాకుండా మనం ఎంతో ఇష్టంగా తినవచ్చు తద్వారా కాకరకాయలో ఉన్న పోషక విలువలని మన శరీరానికి పుష్కలంగా అందుతాయి.
మరి కాకరకాయలో ఉన్నటువంటి చేదుని తొలగించడానికి ఏ విధమైనటువంటి టిప్స్ పాటించాలి అనే విషయానికి వస్తే.. కాకరకాయ మనం చేసేటప్పుడు ముందుగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిటికెడు పసుపు రెండు చెంచాల ఉప్పు వేసి ఒక శుభ్రమైన క్లాత్ లో కట్టి పెట్టాలి. కొద్దిసేపటికి దానిని గట్టిగా పిండటం వల్ల అందులో ఉన్నటువంటి రసం మొత్తం బయటకు వస్తుంది అయితే దానిని పడేయాలి తద్వారా చేదు చాలా వరకు తగ్గిపోతుంది.
ఇక కాకరకాయలను కట్ చేసేటప్పుడు పైన పొట్టు తీసేయాలి ఇలా పీలర్ సహాయంతో కాకరకాయ పైన ఉన్నటువంటి ఆ చెక్క మొత్తం తీసేయడం వల్ల చేదు సగభాగం తగ్గిపోతుంది. ఇక కొన్నిసార్లు కాకరకాయలో విత్తనాలు పెద్దవిగా ఉండటం వల్ల కూడా చేదు వస్తుంది అందుకే వాటిని నిలువుగా కట్ చేసినప్పుడు ఆ విత్తనాలు అన్నింటిని కూడా తొలగించాలి. ఇక కాకరకాయ చేదు రాకుండా ఉండాలి అంటే ముందుగా కాకరకాయ ముక్కలను చింతపండు రసంలో నానబెట్టి అనంతరం వంట చేయటం వల్ల చేదు తగ్గిపోతుంది. ఇలా ఈ టిప్స్ పాటిస్తే కాకరకాయ చేదులేకుండా ఉంటుంది. అలాగే ఫ్రై చేసేటప్పుడు కాస్త బెల్లం లేదా పంచదార వేసుకోవటం వల్ల ఎంతో ఇష్టంగా ఈ ఫ్రై తినవచ్చు.