Throat Pain: సాధారణంగా చలికాలంలో వాతావరణం లో మార్పులు రావటం వల్ల ఎంతోమంది జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఈ సమస్యలు మాత్రమే కాకుండా చాలామందికి గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా మంట పుడుతుంది ఇలా చాలామంది గొంతు నొప్పి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ గొంతు నొప్పి కారణంగా మనం సరిగా తినడానికి కూడా వీలుకాదు అలాగే మాట్లాడటానికి కూడా వీలుకాదు అయితే ఈ గొంతు నొప్పి సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఇంగ్లీష్ మందులు వాడకుండా మన ఇంట్లోనే సహజసిద్ధంగా గొంతు నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు.
గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు కాస్త అల్లం నల్లటి మిరియాలు దాల్చిన చెక్క రెండు తులసి ఆకులను గ్లాస్ నీటిలో వేసి వాటిని బాగా మరగనించి వడపోసుకుని తాగాలి ఇలా ఈ టీ తయారు చేసుకొని తాగటం వల్ల గొంతు నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇక ఇలా చాలా ఘాటుగా తాగలేని వారు ఈ కషాయంలోకి అర టీ స్పూన్ తేనె కలుపుకొని గోరువెచ్చగా తాగటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది.
ఇక నల్ల మిరియాలతో రసం చేసుకుని ఆ రసం తాగడం వల్ల కూడా ఈ గొంతు నొప్పి సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలోకి అర టేబుల్ స్పూన్ తేనె అర టేబుల్ టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగటం వల్ల కూడా ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. ఈ మసాలా దినుసులలో ఉన్నటువంటి యాంటీబయోటిక్ , ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ ను నివారిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో కషాయం చేసుకొని తాగటం వల్ల రెండు రోజులకే ఈ గొంతు నొప్పి సమస్య నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు.