Health Tips: మనం రోజువారి ఆహారంలో ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవారి వరకు ఆకుకూర లను అధికంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అంటే ఆకుకూరల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయని దీనర్థం. ఇలా మనం ఆహారంలో తీసుకునే ఆకుకూరలలో చుక్కకూరతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ, మనలో చాలామందికి వీటి గురించి తెలీదు. ఎప్పుడూ ఒకే ఆకుకూర తీసుకుంటే విసుగ్గా ఉంటుందనే ఒక్కోసారి ఒక్కో కూరను తింటుంటారు.
అయితే, చుక్కకూర వల్ల మనలో సహజంగా వచ్చే కొన్ని వ్యాధుల నుంచి లక్షలు ఖర్చు చేసిన తగ్గనిది కేవలం ఈ ఆకు రసం ఉపయోగించి నయం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యాధులేంటో వాటికి చుక్కకూరను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చుక్కకూర కాస్త అటు ఇటుగా గోంగూర మాదిరిగా పులుపుదనం కలిగి ఉంటుంది. చుక్కకూరను పప్పులో, మిగతా కూరలతో కలిపి వండుకుంటుంటారు. చుక్కకూర పచ్చడి చేసుకునేవారు చాలామంది ఉన్నారు. దీనిలో పీచుపదార్థం (ఫైబర్ కంటెంట్) అధికంగా లభిస్తుంది. దీనివల్ల భోజనం త్వరగా అరుగుదల కానివారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు, కడుపు ఉబ్బరంగా ఉన్నా నివారిస్తుంది. ఒక కట్ట చుక్కకూరలో 123 మిల్లీ గ్రాముల కాల్షియం శరీరంలోకి వెళుతుంది. చుక్కకూర వల్ల కాల్షియం మనలో అదికంగా చేరి ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఎక్కువగా చుక్కకూరతో చేసిన వంటకాలను ఆహారంలో ఉండేలా చూసుకుంటారు.
Health Tips: ఈ ఆకుకూర చుక్కలను చెవిలో వేసుకుంటే నొప్పినుంచి ఉపశమనం..
కిడ్నీ సమస్యకు చుక్కకూర బాగా పనిచేస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలను అదుపులో ఉండేల చేస్తుంది. ఇక చుక్కకూరలో ఇనుము శాతం కూడా అధికంగా లభిస్తుంది. దీనివల్ల శరీరంలోని ఎర్ర రక్త కణాలు బాగా మెరుగుపడతాయి. ముఖ్యం గా చుక్కకూరను ఎండాకాలంలో వారంలో మూడుసార్లు తినడం వల్ల ఒంట్లో ఉండే వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు పాలలో చుక్కకూర రసం కొద్దిగా కలుపుకొని తీసుకుంటే కామెర్ల వ్యాధి సోకిన త్వరగా నయమవుతాయి. ఈ వ్యాధి బారిన పడినవారు ఓ వారం రోజులపాటు చుక్కకూర రసం పాలు కలుపుకొని త్రాగాలి. కామెర్ల బారినుంచి బయటపడతారు. అంతేకాదు, చెవిపోటు ఉన్నవారు ఈ ఆకుకూర చుక్కలను చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా తేలు కాటుకు బలైనవారు అది కుట్టిన చోట చుక్కకూర రసం చుక్కలను పోసినట్టైతే త్వరగా కోలుకుంటారు. తేలు కుట్టగానే ఈ రసం పోయడం వల్ల క్షణాలో ఒంట్లోకి పాకే విషాన్ని అడ్డుకుంటుంది.