Black Bangles: నలుపు ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఇష్టపడే రంగు నలుపు రంగు వేసుకోవడం వల్ల అందం మరింత రెట్టింపు అవుతుందని భావిస్తుంటారు కానీ పెద్దవాళ్లు మాత్రం నలుపు అశుభానికి సంకేతం అని చెబుతుంటారు. ఏదైనా శుభకార్యాల సమయంలో నలుపు రంగును అసలు ఉపయోగించరు. పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు వేసుకోరు. ఇలా నలుపు రంగు అశుభానికి సంకేతంగా భావిస్తారు కనుక నలుపు రంగు దుస్తులు గాజులు వంటి వాటిని కూడా వేసుకోవడానికి ఇష్టపడరు.
ముఖ్యంగా కొత్తగా వివాహమైనటువంటి వారు నలుపు ధరించకూడదని పెద్దవాళ్ళు చెబుతుంటారు. కానీ నలుపు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందనే విషయాల గురించి పండితులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే.. నలుపు వేసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చట. మహిళలు నలుపు రంగు గాజులను వేసుకోవడం వల్ల ఇది పాజిటివ్ ఎనర్జీని గ్రహించి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది.
చాలా చోట్ల పెళ్లైన తర్వాత నవ వధువులు ఎరుపు గాజులతో నల్ల గాజులను ఆడవాళ్లు వేసుకుంటుంటారు. దీని వల్ల మహిళల దాంపత్య జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మహిళలు తమ చేతుల్లో నల్ల గాజులను వేసుకుంటే అది వారి భర్తను చెడు కన్ను నుంచి కాపాడుతుందని అర్థం.అలాగే భర్త ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగు పరుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పెళ్లైన నూతన వధువు.. ఆరు నెలల పాటు నల్ల గాజులు వేసుకుంటే.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావని పండితులు చెబుతున్నారు.