Beauty Tips: చలికాలం వచ్చింది అంటే మన స్కిన్ బాగా డ్రై అవ్వడం జరుగుతుంది. ఇలా స్కిన్ మొత్తం డ్రై అవ్వడం వల్ల పగుళ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా పాదాల పగుళ్లు చాలా మందికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఇలా పాదాల పగ్గుల సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఎన్ని రకాల మందులు వాడిన ఈ సమస్య నుంచి బయట పడలేరు. ఈ విధంగా పాదాల పగుళ్ల సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
ముందుగా రెండు నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల వాటర్లో ఈ నిమ్మకాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసి మరిగించాలి అనంతరం ఒక టబ్బులో సగానికి పైగా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ నీటిలోకి మనం మరిగించినటువంటి నిమ్మకాయ నీటిని కూడా వేసుకోవాలి. వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మన రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూ వేసి బాగా కలియబెట్టి దాదాపు 20 నిమిషాల పాటు మన కాళ్లు అందులో పెట్టుకోవాలి. అనంతరం పాదాలను బాగా స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.
ఇలా 20 నిమిషాల తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వాసిలిన్, రెండు టేబుల్ టీ స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనె వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లపై రాసి బాగా మర్దన చేయాలి ఇలా చేయటం వల్ల రెండు మూడు రోజుల్లోనే పాదాల పగల సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు అయితే ఈ చిట్కా పాటించడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.