Sravana Masam: శ్రావణ మాసం మన హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం అని భావిస్తారు. ఇక ఈ శ్రావణ మాసంలో ఎంతోమంది భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా భక్తిశ్రద్ధలతో సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేయడం మంగళవారం మంగళ గౌరీ వ్రతం చేయడం చేస్తుంటారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఈ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో రకాల పూజలు వ్రతాలు ఈ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు.
ఇక ప్రతి శ్రావణ సోమవారం శివుడికి ప్రత్యేకంగా అలంకరణలు పూజలు చేస్తారు అయితే ఈ శ్రావణమాసంలో పెళ్లి కావాల్సిన వారు కూడా శివుడిని పూజించడం వల్ల తొందరగా పెళ్లి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ శ్రావణ మాసంలో శివుడిని పూజించే సమయంలో పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను స్వామివారికి సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి వస్తువులను శివుడికి సమర్పించకూడదనే విషయానికి వస్తే…
శ్రావణమాసంలో శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసే సమయంలో పొరపాటున కూడా పసుపు కుంకుమలను సమర్పించకూడదని పండితులను చెబుతున్నారు పసుపు కుంకుమలు అనేవి సౌభాగ్యానికి ప్రతీక కానీ శివుడు మాత్రం స్మశానంలో బూడిద పూసుకొని ఉంటారు కనుక ఆయనకు పసుపు కుంకుమలు సమర్పించకూడదని వీలైతే చందనం సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణమాసంలో రాగి పాత్రలో నీటితో స్వామివారికి అభిషేకం అసలు చేయకూడదు. వీలైతే మట్టి లేదా వెండి పాత్రలతో స్వామివారికి నీటిని అభిషేకం చేయడం మంచిది.
ఇక పొరపాటున కూడా తులసిమాలను తులసి ఆకులను శివుడి పూజలు ఉపయోగించకూడదు. తులసి రాక్షక రాజు జలంధరకు భార్య. ప్రపంచాన్ని జలంధరుడు నాశనం చేస్తోన్న సమయంలో భోళాశంకరుడు ఆయన్ను చంపాడట. కాగా తులసి ఆగ్రహించడంతో.. నా పూజలో ఇకనుంచి తులసిని వాడొద్దని శాపం పెట్టారట. అందుకే శివుడి పూజలు తులసిని అసలు ఉపయోగించారని పండితులు చెబుతున్నారు.