Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఎదుగుదలను కోరుకుంటూ అందుకు అనుగుణంగా ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు. ఇలా కష్టపడి పని చేస్తూ జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్రశాంతకరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటారు. అయితే మనకు ఎలాంటి జీవితం రావాలి అన్నది పూర్తిగా మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు. చాలామందికి కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉంటాయి అలాంటి అలవాట్లు కనుక ఉంటే వారు వారి జీవితంలో ఎప్పటికీ ఉన్నత స్థాయికి చేరుకోలేరని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా మన జాతకంలో గ్రహాల అనుకూల స్థితులను బట్టి మనం జీవితంలో సంతోషంగా ఉండటం ఇబ్బందులను ఎదుర్కోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మనకు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే అసలు జీవితంలో పైకి రాలేరు. చాలామంది ఇంట్లో పరిశుభ్రత పాటించరు. ముఖ్యంగా బాత్రూమ్స్ ఎప్పుడు మురికిగా కంపు కొడుతూ ఉంటాయి. ఇలాంటి వారి ఇంట్లో రాహు ప్రభావం చూపుతుంది. అలాగే చాలామంది సాయంత్రం లేటుగా పండుకోవడం ఉదయం చాలా ఆలస్యంగా లేయడం చేస్తుంటారు. ఈ అలవాటు కనక ఉంటే చంద్రగ్రహ దోషానికి గురి కావాల్సి ఉంటుంది.
ఇక చాలామంది రాత్రి తిన్న సామాన్లను అలాగే పగలంతా కూడా గిన్నెలు తోమకుండా సింక్ నిండా వేసి ఉంటారు. ఇలా సింక్ లో కనుక ఎంగిలి పాత్రలు ఉన్నాయి అంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఇక ఇంటి ఆవరణంలో ఎండిన మొక్కలు ఉన్న వాటిని అసలు పట్టించుకోరు. ఇలా ఎండిన మొక్కలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందుకే ఇలాంటి మొక్కలను తీసివేయటం మంచిది. ఈ అలవాట్లు కనుక మీకు ఉన్నాయి అంటే జీవితంలో మీకు ఎదుగుదల ఉండదని పండితులు చెబుతున్నారు.