Pregnancy: పెళ్లయిన ప్రతి ఒక్క మహిళ తల్లి కావాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మహిళ తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యం కూడా ఎంతో మంచిగా ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో తల్లి ఎప్పుడు కూడా మంచిగా నిద్రపోవడం పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
Pregnancy: రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం
రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం నిద్రపోవాలి రాత్రి 8 గంటల సమయం గర్భిణీ స్త్రీలకు ఎంతో అవసరం అలాగే తరచూ పోషక పదార్థాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అలాగే నీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటుంది. ఇలా ఎన్నో తీసుకోవడం వల్ల పుట్టే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా పడుతుందని చెప్పాలి అలా కాకుండా గర్భిణీ స్త్రీలు చాలా మంది కొన్ని చెడు అలవాట్లకు కూడా బానిసలుగా మారుతూ ఉంటారు.
గర్భధారణ సమయంలో పొరపాటున కూడా పొగాకు ధూమపానం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై వాటి ప్రభావం చూపుతుంది తద్వారా బిడ్డ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో జన్మిస్తారు. అందుకే గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని ఇలాంటి అలవాట్లు ఉంటే మానుకోవాల్సిన అవసరం చాలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు రాత్రి పడుకునే సమయంలో కాఫీ తాగకూడదు కాఫీలో కెఫిన్ ఉండటం వల్ల ఇది నిద్ర పై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు కాఫీలు తాగకపోవడం మంచిది.