Vasantha Panchami: హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలోని శుక్లపక్ష పంచమి తిధి ఫిబ్రవరి 14వ తేదీన వస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ చదువుల తల్లి జ్ఞాన దేవత సరస్వతీ దేవినే పూజిస్తూ ఉంటారు. ఈ వసంత పంచమి రోజు ఎంతోమంది భక్తిశ్రద్ధలతో వసంత పంచమి వ్రతం ఆచరిస్తూ సరస్వతి దేవిని పూజిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు విద్యాభ్యాసం కూడా చేపిస్తారు. మరి ఈనెల 14వ తేదీ జరగబోయే వసంత పంచమి ఎలా జరుపుకుంటారు ఆరోజు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
వసంత పంచమి రోజున ప్రజలు తమ ఇళ్లలో రుచికరమైన వంటకాలు, స్వీట్లు తయారుచేసి, పసుపు బట్టలు ధరించి అమ్మవారిని కొలుస్తారు. అంతేకాకుండా కొంతమంది సరస్వతీ పూజ రోజున ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఉపవాసం ఉండేవారు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. వసంత పంచమి రోజు ఉపవాసం ఉండాలనుకున్న వారు ఉదయమే స్నానం చేసి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
వసంత పంచమి రోజు మొత్తం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అమ్మవారిని శుభ సమయంలో పూజించి ఉపవాసం విరమించవచ్చు. ఆమెకు ఇష్టమైన పండు రేగును తిని ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమించాక సరస్వతీ దేవికి నైవేద్యంగా పెట్టిన పదార్థాలను ప్రసాదంగా అందరికీ పంచాలి. ఉపవాసం సమయంలో తీపి అన్నం, మాల్ పూవా, బూందీ లడ్డూలు, కళానుగున పండ్లు మొదలైనవి తినవచ్చు. అయితే ఆ రోజున ఉపవాసం ఉన్నప్పుడు తామసిక వస్తువులు అస్సలు తినకూడదు. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా వాడకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.