Deepavali: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు దీపావళి పండుగ కూడా ఒకటి. దీపావళి పండుగ మరి కొద్ది రోజులలో రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల హడావుడి మొదలైంది. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. ఇక దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని కనుక ప్రత్యేక అలంకరణలు చేసి పూజించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.
ఇక ఈ ఏడాది నవంబర్ 12వ తేదీ దీపావళి పండుగను జరుపుకోబోతున్నారు. మరి కొద్ది రోజులలో దీపావళి పండుగ రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. దీపావళి పండుగ రావడానికి ముందుగా ప్రతి ఒక్క ఇంటిని కూడా శుభ్రపరుచుకోవడం అవసరం. మన ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా విరిగిపోయిన పాత వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే బయటపడేసి ఇంటిని శుభ్రం చేయాలి.
లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే శుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంత అడుగుపెడుతుంది అందుకే దీపావళి కంటే ముందుగానే ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి ఇక ఇంట్లో పెరిగిపోయిన పాత సామాన్లు ఉంటే వాటిని వెంటనే బయటపడేయాలి ఇక ఇంటి ఆవరణంలో చెట్లు కనుక ఉంటే ఆ చెట్లు ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఏమైనా చెట్లు ఎండిపోయి ఉంటే వెంటనే వాటిని తొలగించి వాటి స్థానంలో మరొక కొత్త చెట్లను నాటడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక పండుగ రోజు సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేయడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.