Devotional Fact: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ కొడతాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి నీళ్లను తీర్థ ప్రసాదంగా మనకు పండితులు వేస్తూ ఉంటారు. అయితే ఈ తీర్థం తీసుకునే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు కానీ తీర్థం తీసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి తీర్థం తీసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే.
చాలామంది తీర్థం తీసుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించి తీర్థం తీసుకుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మన ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టి చూపుడు వేలు బొటనవేలును మడిచి కేవలం మూడూ వేళ్ళు ముందుకు చాచి తీర్థం తీసుకోవాలి. ఇలా తీర్థం తీసుకున్న తర్వాత ఆ తీర్థం చాలామంది తలపైకి రాసుకుంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు.
మన తలపై బ్రహ్మదేవుడు ఉంటారు మనం తీర్థం తాగే ఆ ఎంగిలి చేతిని తలపైకి రాసుకోవడం వల్ల బ్రహ్మదేవుడిని మనం అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు. అందుకే తీర్థం తీసుకున్న తర్వాత శుభ్రమైన గుడ్డకు చేతిని తుడుచుకోవడం లేదా కడగడం వంటివి చేయాలి అంతే కాకుండా మనకు వేసినటువంటి తీర్థం ఇతరులకు తాపించకూడదు. అలాగే కింద పడేయకూడదు ఇలా తీర్థం తీసుకునే సమయంలో ఈ నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం.