Sweet potato: సాధారణంగా మనకు కొన్ని కాలాలలో మాత్రమే కొన్ని రకాల కూరగాయలు పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి ఇలా శీతాకాలంలో ఎక్కువగా మార్కెట్లో మనకు చిలగడ దుంపలు అందుబాటులోకి వస్తుంటాయి. ఇలా చలికాలం వచ్చిందంటే మార్కెట్లో చిలకడదుంపలు విరివిగా లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా శీతాకాలంలో మాత్రమే లభించే ఈ చిలకడ దుంపలను మనం మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే తినకుండా ఎవరూ ఉండలేరు. మరి చిలకడ దుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
![Sweet potato: చలికాలంలో చిలగడ దుంపలు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? these-are-the-important-reasons-to-eat-chilakada-dumpa-in-winter](http://natelugu.com/wp-content/uploads/2023/10/Collage-Maker-29-Oct-2023-07-45-AM-5356.jpg)
చిలకడదుంపలలో ఎన్నో రకాల పోషక విలువలతో పాటు విటమిన్లు మెగ్నీషియం బీటా కెరోటిన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి అందుకే ఈ చిలగడ దుంపలను చలికాలంలో తీసుకోవడం ఎంతో ముఖ్యం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఈ చిలకడదుంపలు మనల్ని బయటపడేస్తాయి అలాగే చిలకడదుంపలు తినడం వల్ల మన శరీరంలో వేడిని కలిగింపజేస్తాయి కనుక చలి తీవ్రతను తగ్గించడానికి కూడా దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ మనం తీసుకున్నటువంటి ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి దోహదం చేస్తాయి. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.దీనితో శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి ఇక ఇందులో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల ప్రోస్టేట్ అండాశయ క్యాన్సర్ ను నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. చిలగడదుంపలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మహిళలలో సంతాన ఉత్పత్తికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ చిలకడదుంపలు తీసుకోవడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.