Wed. Jan 21st, 2026

    Health Tips: మన వంటింట్లో ఉండే మసాలా దినుసులలో ధనియాలు తప్పనిసరిగా ఉంటాయి ధనియాలు వంటలలో వేయటం వల్ల వంటకు సరైన రుచి రావడమే కాకుండా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందనే సంగతి తెలిసిందే. ఇలా ధనియాలను పొడిగా చేసుకుని వంటలలో ఉపయోగిస్తూ ఉంటాము.అయితే మనం ఈ ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయమే పరగడుపున ఆ నీటిని తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి నానబెట్టిన ధనియాల నీటిని తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రింక్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా దోహదపడుతుంది.

    డయాబెటిస్‌ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండేవారు ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి అలాగే ఈ ధనియాల నీటిని తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింప చేయడమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా మనల్ని కాపాడుతుంది. ఇలా పరగడుపున ఒక గ్లాసు ధనియాల నీటిని తాగటం వల్ల ఈ ప్రయోజనాలు అన్నింటిని మనం సొంతం చేసుకోవచ్చు.