Risk Foods In Periods: మహిళలు ప్రతినెల నెలసరి సమస్యతో ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలా నెలసరి కారణంగా చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల కారణంగా కనీసం గది నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడరు అలాగే మరికొందరు తీవ్రమైనటువంటి పొత్తి కడుపునొప్పి నడుము నొప్పి వంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలా ప్రతి నెల మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా నెలసరి నొప్పులతో బాధపడేవారు పొరపాటున కూడా పీరియడ్స్ టైం లో కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
పీరియడ్స్ టైం లో చాలామంది కడుపునొప్పి వంటి సమస్య నుంచి ఉపశమనం పొందటానికి ఎక్కువగా కాఫీ టీ తాగుతూ ఉంటారు అయితే నెలసరి సమయంలో ఈ కాఫీ టీ ఎక్కువగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. అంతే కాకుండా పొట్ట నొప్పి కూడా వస్తుంది. నెలసరి సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల.. స్త్రీ జననేంద్రియాలకు సమస్యలు వస్తాయి. వీటి కారణంగా పొత్తి కడుపులో నొప్పి, జీర్ణ క్రియ సమస్యలు వంటివి వస్తాయి.
ఇక పీరియడ్స్ టైం లో మధ్యపానానికి కూడా దూరంగా ఉండటం మంచిది. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. వీటి కారణంగా.. బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరగడం జరుగుతుంది. పాలు బలమని కొంత మంది పీరియడ్స్ లో తాగుతూ ఉంటారు. పాలలో లాక్టోస్, అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. దీని కారణంగా ఇది పొట్ట ఉబ్బరాన్ని పెంచడమే కాకుండా కడుపు నొప్పి రావడానికి కూడా కారణం అవుతుంది కనుక పీరియడ్స్ టైం లో మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.