Vastu Tips: సాధారణంగా మనం మన ఇంట్లో ఎన్నో రకాల జంతువులను పక్షులను పెంచుతూ ఉంటాము అయితే కొన్ని రకాల జంతువులను ఇంట్లో పెంచడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే మరికొన్ని జంతువులు ఇంట్లో లేకపోవడమే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల జంతువులను పిల్లలను పెంచడం వల్ల ఇంట్లో దరిద్రం తిష్ట వేస్తుందని అలాంటి జంతువులు ఇంట్లో లేకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మరి ఇంట్లో ఉండకూడని ఆ జంతువులు ఏంటి అనే విషయానికి వస్తే..
మన ఇంట్లో పిల్లులను సాధారణంగా పెంచుతూ ఉంటాము. అయితే ఎప్పుడు కూడా నల్ల పిల్లిని ఇంట్లో పెంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నల్ల పిల్లులు చెడు స్వభావాలు కలిగి ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు నల్ల పిల్లి ఎదురు వస్తే అనుకున్న పనులు జరగవని భావిస్తారు. ఇక ఇటీవల కాలంలో పాములను పెంచడం కూడా చాలామంది అలవాటు చేసుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా ఈ జంతువులను ఇంట్లో పెంచడం మంచిది కాదు.
ఇక కాకులు మన పూర్వీకులకు సంకేతంగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా కాసులు ఆత్మలు కూడా ఉంటాయని చెబుతుంటారు. అందుకే కాకి మన ఇంటి దరిదాపులలోకి వచ్చి అరవడం కూడా మంచిది కాదని చెబుతూ ఉంటారు.. ఇలాంటి జంతువులు కనుక మన ఇంటి ఆవరణంలో ఉంటే ఆ శుభమని అందుకే వీటిని వీలైనంత వరకు దూరం పెట్టడమే మంచిదనీ పండితులు చెబుతున్నారు.