Wed. Jan 21st, 2026

    Chiranjeevi – Srimukhi : చిరు, శ్రీముఖిల మధ్య నడుము సీన్ ఉండబోతుందని..భోళా శంకర్ సినిమాకి అది హైలెట్‌గా నిలుస్తుదని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ నడుము సీన్ అంటే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది ఖుషి సినిమాలోని పవన్ కళ్యాణ్, భూమిక కాంబోలో చిత్రీకరించినదే. ఇంట్రవెల్ ముందు వచ్చే ఈ సీన్ సినిమాకి చాలా హైలెట్. ఖుషి ఎన్ని భాషలలో వచ్చినా కూడా తెలుగులో సన్నివేశం గురించే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.

    the-waist-scene-between-chiranjeevi-and-srimukhi-mega-fans-are-waiting
    the-waist-scene-between-chiranjeevi-and-srimukhi-mega-fans-are-waiting

    నితిన్ కూడా ఈ సీన్ అనుసరించి గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో పెట్టాడు. కానీ, ఆ సీన్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. అయితే, ఇప్పుడు ఇదే సన్నివేశాన్ని మెగాస్టార్ చిరంజీవి, బుల్లితెర పాపులర్ యాంకర్ కం నటి శ్రీముఖిల మధ్య చిత్రీకరించబోతున్నారట. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా ప్రధాన పాత్రల్లో భోళా శంకర్ తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా కనిపించబోతోంది.

    Chiranjeevi – Srimukhi : చిరు, శ్రీముఖిల సీన్స్ ఎలా అలరిస్తారో.

    ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తైంది. చిరు, శ్రీముఖిలపై ఆల్రెడీ కొన్ని సన్నివేశాలను కంప్లీట్ చేశారు. అయితే, వాటిలో కొన్ని మళ్ళీ రీషూట్ చేస్తున్నారట. దీనిలో భాగంగా చిరంజీవి శ్రీముఖి నడుము చూసే సీన్ తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సీన్‌లో ఇద్దరు పోటీపడి నటించారని చెప్పుకుంటున్నారు. కానీ, కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఇలాంటి సీన్స్ మెగాస్టార్ చేయడం అంత బాగోదని అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారట. ఆయన స్టామినాకి మరీ ఇంత సిల్లీ సీన్స్ చేయడం కరెక్ట్ కాదని చర్చించుకుంటున్నారట. మరి అన్నయ్య ఇలాంటి సీన్స్‌లో నటించి థియేటర్స్‌లో ఈలలేయిస్తారు. చూడాలి భోళా శంకర్ మూవీలో చిరు, శ్రీముఖిల సీన్స్ ఎలా అలరిస్తారో.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.