Corona Virus: కరోనా వైరస్ మానవసృష్టే… అమెరికా శాస్త్రవేత్త బయటపెట్టిన సంచలన నిజాలు

Corona Virus: గత రెండేళ్ళ కాలంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. లక్షలాది ప్రజలు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉన్న, ఇతర దేశాలలో మాత్రం లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. కొన్ని దేశాలలో అయితే కరోనాతో చనిపోయిన వారిని మూకుమ్మడిగా గుంతలు తీసి పాతిపెట్టారు అంటే పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.చైనా, అమెరికా, రష్యా, కెనడా లాంటి దేశాలలో కరోనా విలయతాండవం చేసింది. ఇక భారత్ లో కూడా కరోనా సృష్టించిన విధ్వంసంతో ప్రజలు ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా చాలా నష్టపోయారు. కనీసం మూడు పూటల తినలేని దైన్యస్థితిలోకి చాలా మంది వెళ్ళిపోయారు.

ఇక ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ కరోనా భయానక జ్ఞాపకాల నుంచి బయటకి వస్తుంది. మళ్ళీ ప్రజలు మామూలు జీవితంలోకి వచ్చి, భయాన్ని వదిలేసి జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికి కరోనా మనతో పాటు సహవాసం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి చైనాతో కరోనా ప్రభావం కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకి వచ్చిందని, ఇది మానవ సృష్టి అని ప్రపంచంలో చాలా దేశాలు నమ్ముతున్నాయి. వూహాన్ లో వైరాలజీ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఒక చైనా శాస్త్రవేత్త ఈ విషయాన్ని వీడియో రూపంలో బయటపెట్టిన రెండో రోజే కనిపించకుండా పోయాడు. అయితే చాలా కాలం తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో మరణించడం విశేషం.

అలాగే మరో మహిళ శాస్త్రవేత్త కూడా ఇలాగే కరోనా వైరస్ మానవ సృష్టే అని చెప్పే ప్రయత్నం చేసింది. తరువాత ఆమె కూడా కనిపించకుండా పోయింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా వైరస్ చైనా కావాలని సృష్టించింది అనే విషయాన్ని అంగీకరించలేదు. అలాగే చైనాకి భయపడి కనీసం విచారణకి ఆదేశించే ధైర్యం కూడా చేయలేదు. అయితే ఇప్పటికి ఇండియా సైతం చైనా కావాలని తన శత్రు దేశాలలో బయో వార్ ద్వారా విధ్వంసానికి చేసిన కుట్రలో భాగమే ఈ కరోనా వైరస్ అని నమ్ముతుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనాలో వూహాన్ ల్యాబ్ లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడమాలజిస్ట్ ఆండ్రూ హఫ్ రాసిన ది ట్రూత్ అబౌట్ వూహాన్ పుస్తకంలో కరోనా వైరస్ గురించి భయంకర నిజాలు బయటపెట్టారు.

కరోనా వైరస్ వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో ప్రయోగాల ద్వారా ఊపిరి పోసుకున్నదేనని నిర్ధారించారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అమెరికా అందించిన నిధులతోనే ఈ వైరస్ ని వూహన్ వైరాలజీ ల్యాబ్ లో జన్యుపరంగా సృష్టించారని పేర్కొన్నారు. ఆ ల్యాబ్ నుంచి ఇది వూహాన్ లో ముందుగా బయటకి వచ్చిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడు అండ్రూ హాఫ్ రాసిన పుస్తకం వైరల్ గా మారింది. అయితే దీనిపై చైనా ఎలాంటి సమాధానం చెబుతుంది అనేది ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

2 weeks ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

2 weeks ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 weeks ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 weeks ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

2 weeks ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

2 weeks ago

This website uses cookies.