Categories: LatestMost ReadNews

General News: భయాన్ని వదిలేయడం చాలా సులభం అని మీకు తెలుసా?

General News: పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాదు. ప్రతి ఒక్కరి జీవితం అమ్మ గర్భంలోనే మొదలైంది. అనాగరికంగానే మొదలైంది. అయితే ఎప్పుడు ప్రపంచంలో మనం మాట్లాడుకుంటున్న, ఏంతో మంది మేధావులు, ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ధనవంతులు, మనం దైవంగా ఆరాధించే దేవుళ్ళు అయిన అందరి ఒకే విధంగా ప్రయాణం మొదలు పెట్టారు. ఎదిగే క్రమంలో వారి ఆలోచనలతో ఒక్కో దిశలో జీవన గమనాన్ని మార్చుకున్నారు. వారు ఎంచుకున్న రంగంతో, నమ్మిన సిద్దాంతంతో, మార్చుకున్న ఆలోచనతో ఈ ప్రపంచం గుర్తుంచుకునే స్థాయికి వెళ్ళారు. చరిత్రలో వారి గురించి చర్చించుకునే వ్యక్తులుగా మారిపోయారు. ఈ గుర్తింపు ఏమీ వారికి అంత సులభంగా ఏమీ రాలేదు. ఎలాంటి కష్టం, నష్టం లేకుండా ఎదగలేదు. అయితే వారందరూ వారు ఎంచుకున్న మార్గంలో గప్ప మార్గదర్శకులుగా నిలవడానికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే. భయాన్ని దాటుకొని, బలహీనతని వదులుకొని చేసిన ప్రయాణమే వారి స్థాయిని ఈ ప్రపంచానికి పరిచయంచేసింది.

పుట్టినప్పటి నుంచి సమాజం చాలా రకాల భయాలని పరిచయం చేస్తుంది, మనల్ని మానసికంగా బలహీనులుగా మార్చేస్తుంది. ఆ సమాజంలో తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు. స్నేహితులు ఉంటారు. మన చుట్టూ ఉన్న ఆ నలుగురు ఉంటారు. వీరే మనల్ని గొప్పవాళ్ళుగా నిత్యం అడ్డుకుంటూ ఉంటారు. సమాజంలో తరతరాలుగా మానసిక పొరల్లో గూడుకట్టుకొని ఉన్న కొన్ని భయాలు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారిని కూడా ముందుకి కదలకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. తల్లిదండ్రులు తమకి పుట్టిన పిల్లలకి మొదటి గురువులు. వారిని చూసే అన్ని పిల్లలు మూడేళ్ళ వరకు నేర్చుకుంటారు. అయితే ఇక్కడే కొన్ని భయాలని పిల్లలలో పెంపొందించే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తున్నారు. వాళ్ళు  ఏదైనా ఒక పని చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారికి నచ్చని పని పిల్లలు చేస్తూ ఉంటే దానిని ఆపడానికి పిల్లలకి ఒక భయాన్ని పరిచయం చేస్తారు.

ముందుగా పిల్లలకి చీకటిని చూపిస్తూ ఆ చీకట్లో ఏదో ఉంది అంటూ భయపెడతారు. దాంతో చిన్న వయస్సు నుంచి చీకటికి భయపడటం పిల్లలకి అలవాటుగా మారిపోతుంది. పెరిగే క్రమంలో చుట్టూ ఉన్న బంధువులు అందరూ వారికి నచ్చని పనులు చేసే పిల్లలని వాటి నుంచి దూరం చేయడానికి ఆ పని చేస్తే ఏదో ప్రమాదం జరుగుతుందనే భయాన్ని పరిచయం చేస్తారు. అప్పటి నుంచి ప్రమాదం అనే పనులు చేయడానికి పిల్లలు భయపడతారు. తరువాత ఉపాధ్యాయుల రూపంలో కూడా ఒక సబ్జెక్ట్ ని బోధించే క్రమంలో దానిని సులభమైన పద్ధతిలో చెప్పకుండా కష్టం అనే మాటని పరిచయం చేస్తారు. దీంతో ఏ సబ్జెక్ట్ విషయంలో కష్టం అనే మాట భయం పరిచయం అయ్యిందో దానిలో పిల్లల ప్రావీణ్యం క్రమంగా తగ్గిపోతుంది.

ఇక ఎదిగే క్రమంలో స్నేహితులు పలానా ఇంగ్లీష్ మన భాష కాదు, మాట్లాడటం కష్టం, హిందీ మన భాష కాదు నేర్చుకోవడం కష్టం. అమ్మో లెక్కల అవి అస్సలు అర్ధం కావు అంటూ నెగిటివ్ ఐడియాలజీని వారితో పాటు వారి చుట్టూ ఉన్న అందరిలో నింపేస్తారు. దీంతో ప్రతి సందర్భంలో భయం అనే మాట, కష్టం అనే మాట పదే పదే వినపడటం వలన మన మనస్సు దానికి ఎడిక్ట్ అయిపోతుంది. దీంతో భయపెట్టే విషయాలపై, కష్టం అనిపించే అంశాలపై మానసికంగా శ్రద్ధ పెట్టలేము. ఎప్పుడైతే మానసికంగా శ్రద్ధ పెట్టాలేమో అప్పుడే లైఫ్ లో ముందుకి వెళ్ళలేక ఒకేచోట నిలబడిపోతాం. అయితే చాలా మంది ఇక్కడ ఒక మాట చెబుతారు. రిస్క్ చేస్తేనే లైఫ్ లో ముందుకి వెళ్ళగలం అని అంటూ ఉంటారు. రిస్క్ అనే సౌండ్ నెగిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే సమాజంలో 80 శాతం మంది రిస్క్ అనే మాటకి భయపడి ప్రయత్నం ఆపేస్తారు. దీంతో ముందుకి వెళ్ళలేక ఎలాగోలా బ్రతికేస్తారు. అయితే ప్రపంచంలో ఏది సాధించడానికి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం భయాన్ని దాటుకొని ముందుకి వెళ్తే సరిపోతుంది.

భయపెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నంత సేపు అది భయపెడుతూనే ఉంటుంది. అయితే ఆ భయం అనే భావనని దూరం చేసుకుంటే మన ప్రయాణంలో ఎలాంటి రిస్క్ లేకుండానే ఎక్కడికి వెళ్లాలని అనుకుంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. ప్రపంచానికి మనల్ని మనం గొప్పగా పరిచయం చేసుకోవడానికి గొప్ప బాటలు వేసుకోగలం. రిస్క్ అనేది మన కెపాసిటీని పరిచయం చేస్తుంది.జీవితంలో భయపెట్టే విషయాన్ని గాలికి వదిలేసి ముందుకెళ్ళిపోతే అది ఎప్పటికి మళ్ళీ మనకి ఎదురుకాదు. కష్టం అనే ఆలోచనని వెనక వదిలేస్తే మన ముందు ఎక్కడ మళ్ళీ అది కనిపించదు. వదిలేయ్ అనే మాట చాలా చిన్నగా కనిపిస్తుంది…. కాని జీవితాన్ని ప్రశాంతంగా ముందుకి వెళ్ళేలా చేస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.