Solar Eclipse: మన హిందూ సంప్రదాయ ప్రకారం వచ్చే సూర్య చంద్ర గ్రహణాలను అశుభంగానే పరిగణిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఏడాది వచ్చే సూర్యచంద్ర గ్రహణాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అయితే ఈ ఏడాదిలో ఇదివరకు ఎన్నో సూర్య చంద్ర గ్రహణాలు వచ్చాయి. ఇక ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం రాబోతోంది. అక్టోబర్ 14వ తేదీ అమావాస్య అనే సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడిన నేపథ్యంలో మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలుగా ఉండడం ఎంతో అవసరమని పండితులు చెబుతున్నారు.
అక్టోబర్ 14వ తేదీ శనివారం ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణ సమయంలో ఎక్కువగా రాహు ప్రభావం ఉండబోతుందని పండితులు చెబుతున్నారు అయితే ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే… సమయంలో ఎవరు కూడా బయటకు రాకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను కూడా చేయకూడదు ఇక నేరుగా సూర్యుడిని అసలు చూడకూడదని పండితులు చెబుతున్నారు అయితే ఈ సూర్యగ్రహణం భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలియజేస్తున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకపోవడం ఎంతో మంచిది.
గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వెలువడే అతి ప్రమాదకరమైనటువంటి కిరణాలు గర్భిణీ స్త్రీపై పడటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే గర్భిణీ స్త్రీలు బయటకు రాకపోవడం ఎంతో మంచిది ఇక గ్రహణ సమయంలో నిద్ర పోకూడదు అలాగే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే పూజా కార్యక్రమాలను కూడా చేయకూడదు కేవలం మన ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ప్రార్థించుకోవడం ఎంతో మంచిది. ఇక గ్రహణం అయిన అనంతరం ఇంటిని శుభ్రంగా శుద్ధి చేసి స్నానం చేయడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.